ఆ వార్త‌ల్లో నిజం లేదుః భ‌ట్టి విక్ర‌మార్క

mallu
mallu

హైదరాబాద్‌: శాస‌న‌స‌భ స‌మావేశాలు రేపే ముగిద్దామని కాంగ్రెస్‌ అన్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క తోసిపుచ్చారు.
రేపు జరిగే బీఏసీలో మిగిలిన విషయాలు చర్చిస్తామని తెలిపారు.‘‘సభలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మేం 18 అంశాలపై చర్చించాలని కోరాం. మేము ఇచ్చిన ప్రతి అంశంపైన చర్చ జరగాల్సిందే. కాంట్రిబ్యూటరీ ఫించను పథకం, స్వయం సహాయక మహిళాసంఘాలు, బీసీ ఉప ప్రణాళిక, ప్రజాపంపిణీ, ఆరోగ్య సంబంధ అంశాలు, నయీమ్‌, మియాపూర్‌ భూములు, మాదకద్రవ్యాలముఠా, రెండుపకడ గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, జీఎస్టీ ప్రభావంపై చర్చ జరగాల్సిందే’’ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.