ఆ వార్తల్లో నిజం లేదుః కమల్

చెన్నైః నవంబర్ 7వ తేదీన పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోన్నప్రముఖ నటుడు కమల్ హసన్ అదే రోజున రాజకీయ పార్టీ పెడతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ వార్తలను ఆయన ఖండించారు. మీడియాలో వస్తోన్న కథనాలు నిజం కాదని, పుట్టినరోజు సందర్భంగా కేవలం అభిమానులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు. ఆ రోజున పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ప్రకటిస్తానని, తన అభిమానులతో భేటీ కావడం చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయమని ఆయన స్పష్టం చేశారు.