ఆ వార్త‌ల్లో నిజం లేదుః అనుష్కశ‌ర్మ‌

Anushka-Sharma
Anushka-Sharma

ముంబయి: క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ న‌టి అనుష్క శర్మ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవ‌ల వార్తాలు వ‌చ్చాయి. ఇద్దరు కలిసి రెస్టారెంట్లు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు, ఈ హోటళ్లు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు కాబోతున్నాయని  తెలిసింది. మొదట ఢిల్లీ కేంద్రంగా ఓ రెస్టారెంట్‌ని ప్రారంభించి, తర్వాత మిగతా ప్రాంతాలకి విస్తరించబోతున్నట్లు వదంతులు వచ్చాయి. అయితే ఈ వార్తల్ని అనుష్క శర్మ ఖండించారు. ఈ వార్త‌ల్లో నిజం లేదని, తరచూ ఇలాంటి వదంతులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఆమె అసహనం వ్యక్తం  చేసిన‌ట్లు స‌మాచారం.