ఆ వార్తలు నిజం కాదు: మంత్రి జవహర్‌

AP Minister Jawahar
AP Minister Jawahar

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించే ఆలోచనేది ప్రభుత్వానికి లేదని మంత్రి జవహర్‌
తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్‌పై మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం పట్ల సానుకూలంగా
ఉండటాన్ని ఓర్వలేకే జగన్‌ తన స్వంత పత్రిక ద్వారా అసత్య ప్రచారం చేస్తూ ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నారని
ఆరోపించారు. రాష్ట్రం ఆభివృద్ధి చెందడాన్ని జగన్‌ సహించలేకపోతున్నాడని, రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి
లబ్ధి పొందేందుకు జగన్‌ ప్రయత్నించి విఫలమయ్యారని అన్నారు. ఉపాధ్యాయుల కౌన్సిలింగ్‌లో ఎలాంటి అవకతవకలు లేకుండా
జరుగుతున్నప్పటికి దానిపై విమర్శలు చేస్తున్నారని, పనితీరు ఆధారంగా 50ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపుతారంటూ వస్తున్న
వార్తలు వాస్తవం కాదని ఆయన తెలిపారు.