ఆ రోల్ చేయనని రిజెక్టు చేసిందట

మైమరపించే నవ్వు.. అచ్చు తెలుగమ్మాయిలా కన్పించే లుక్కు ..ఇవన్నీ అనుపమకు ప్లస్ పాయింట్స్.. ఇప్పటి వరకు తెలుగులో చేసింది నాలుగు చిత్రాలే అయినా నాలుగు డిఫరెంట్ రోల్స్ చేసింది తాజాగా ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో మెయిన రోల్ చేసింది.. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులేపడ్డాయి.. లేటెస్టుగా ఆమెకు పెద్ద బ్యానర్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది.. ఓ రకంగా ఇది ఆమెకు అర్భుతమైన అవకాశం అంటున్నారు..
కానీ ఆనుపమ ఆ రోల్ చేయనని సున్నితంగా రిజెక్టు చేసిందట. ఎండింగ్లో చనిపోయే పాత్ర కావటంతో ఈ సినిమా చేయటానికి ఇష్టం చూపించలేదనేది టాక్.. తాజాగా చేసిన ఉన్నది ఒక్కటే జిందగీ లోకూడ ఇంటర్వెల్ బ్యాంగ్‌కు చనిపోయే రోల్ చేసింది.. మళ్లీ అదే తరహా పాత్ర కావటంతో పెద్ద బ్యానరే అయినా వద్దని చెప్పేసిందట..ప్రస్తుతం నాని హీరోగా డబుల్రోల్ చేస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.