ఆ రెండు సంస్థలు రాజకీయాలపై ప్రభావం

CIA
CIA

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ వివాదాస్పద ప్రచురణలు చేసింది. భారత్‌కు చెందిన విశ్వ హిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ సంస్థలు మతపరమైన తీవ్రవాద సంస్థలని సిఐఏ పేర్కొన్నది. వరల్డ్‌ ఫ్యాక్ట్‌బుక్‌ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ రెండు సంస్థలు రాజకీయ నాయకులను , రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ,కానీ ఆ సంస్థల్లో పనిచేసే వారు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయరని తన రిపోర్టులో తెలిపింది. ఐతే దీనిపై స్పందించిన విహెచ్‌పి సిఐఏ రిపోర్టును తప్పుబట్టింది. తమపై విమర్శలు చేసింనందుకుగాను సిఐఏ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.