ఆ ముగ్గురితో ఏపి అధోగతి పాలు

AP MINISTER KOLLU RAVINDRA
AP MINISTER KOLLU RAVINDRA

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు జగన్‌, జనసేన పవన్‌, బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు ఏపికి పట్టిన శనిగ్రహాలని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ ముగ్గురు ఏపిని అధోగతి పాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదికి జగన్‌, పవన్‌, జివిఎల్‌ తొత్తులుగా మారారని, ఏపిలో అవినీతి జరుగుతుందంటున్న నేతలు దమ్ముంటే నిరూపించాలని కొల్లు రవీంద్ర సవాల్‌ చేశారు.