ఆ డిఎన్ఎ నాలో లేదుః ఓప్రా

oprah winfrey
oprah winfrey

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని ప్రముఖ అమెరికన్‌ టెలివిజన్‌ హోస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రే అన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఓప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమెరికాలో ప్రస్తుత పాలనా వ్యవస్థ సరిగ్గా లేదని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. ఇటీవల ఇన్‌స్టైల్‌ మ్యాగజైన్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఓప్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2020 ఎన్నికల గురించి ప్రస్తావించారు. నేను ఏం చేయగలను, ఏం చేయలేను అన్న విషయాల్లో నాకు పూర్తి క్లారిటీ ఉంది. నేను కాన్ఫిడెంట్‌గా ఉంటనే ఏ పనైనా చేస్తా. అధ్యక్ష పదవిపై నాకు అంత ఆసక్తి లేదు. ఆ డీఎన్‌ఏ నాలో లేదు అని తెలిపారు.