ఆ ఒక్క కారణంతోనే టైటిల్‌ పెట్టాం

Nara Rohit-2
Nara Rohit

ఆ ఒక్క కారణంతోనే టైటిల్‌ పెట్టాం

హీరో నారా రోహిత్‌ చేసిన తాజా చిత్రం బాలకృష్ణుడు.. ఈనెల24న విడుదల కాబోతోంది.. ఈసందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.

ఈసిపిమా ఎలా ఉంటోంది?
ఇదొక పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. కథ మరీ కొత్తగా ఏమీ ఉండదు.. కానీ దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది.

దర్శకుడు పవన్‌ మల్లెల కొత్త వ్యక్తి కదా రిస్క్‌ అన్పించలేదు?
నేను చాలా మంది కొత్త దర్శకులతో పనిచేశాను.. నాకైతే ఎలాంటి ఇబ్బంది అన్పించలేదు.. పవన్‌ మొదటి సిట్టింగ్‌లోనే కథ చెప్పిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది.

మీ క్యారెక్టర్‌?
ఇందులో నా పాత్ర పేరు బాలు.. డబ్బుకోసం ఏమైనా చేసే క్యారెక్టర్‌ , అలాగని నెగెటివ్‌ షేడ్స్‌ ఏమీ ఉండవు.. ఇప్పటి వరకు నేనుచేసిన పాత్రల్లో ఇదే భిన్నమైన క్యారెక్టర్‌

బాలకృష్ణుడు అనే టైటిల్‌ పెట్టటానికి కారణం?
ప్రత్యేక కారణాలు ఏమీ లేవు.. టైటిల్‌ ద్వారానే సినిమా కమర్షియల్‌ అని తెలిసిపోవాలి.. అలాంటి టైటిల్‌ కోసం ఆలోచిస్తుంటే పవన్‌ మల్లెల ‘బాలకృషు€డు అనే పేరును సజెస్ట్‌ చేశారు.. అందరికీ నచ్చటంతో దాన్ని ఖరారు చేశాం.

ఈసినిమా కోసం బాగా తగ్గినట్టు ఉన్నారు?
ప్రత్యేకంగా సినిమా కోసమనేం కాదు.. తగ్గాలని అనుకుంటుండగా పవన్‌ మల్లెల కాస్త పుష్‌ చేసి తగ్గితే బాగుంటుందని చెప్పటంతో తగ్గాను..

హీరోయిన్‌ గురించి?
రెజీనా ఇందులో నార్మల్‌ హీరోయిన్‌లా కాకుండా ఒక టామ్‌ బా§్‌ులా కన్పిస్తుంది.. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఉంటుంది.

మీ తదుపరి చిత్రాలు?
పరుచూరి మురళి దర్శకత్వంలో జగపతిబాబుగారితో కలిసి ‘ఆటగాళ్లు అనే సినిమా చేస్తున్నాను. అది థ్రిల్లర్‌ .చైతన్య దంతులూరితో ఒక ప్రాజెక్టు ఫైనల్‌ చేశాను. అలాగే కొన్ని లవ్‌స్టోరీలు కూడ వింటున్నాను.