ఆ ఏడు మండలాలను తెలంగాణకివ్వండి

vinod kumar,MP
vinod kumar,MP

న్యూఢిల్లీ: ఏపి పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేరడం లేదని టిఆర్‌ఎస్‌ ఎంపి వినోద్‌ తెలిపారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఎంపి వినోద్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజాకాంక్షలను ప్రధాని నరేంద్ర మోది ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. మోది ప్రభుత్వం అన్యాయంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపిలో విలీనం చేసింది. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే సియంగా ప్రమాణం చేయబోనని చంద్రబాబు చెప్పాడు. ప్రధాని మోది స్వయంగా చొరవ తీసుకుని…ఆ ఏడు మండలాలను ఏపిలో కలిపారు. ఏపిలో విలీనం చేసిన 7 మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలి. ఈ ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేందుకు సభలో బిల్లు పెట్టాలని ఎంపి వినోద్‌ డిమాండ్‌ చేశారు.