ఆ ఆర్టిక‌ల్‌పై అన‌వ‌స‌ర రాద్ధాంతం త‌గ‌దు

Mani shankar ayyar
Mani shankar ayyar

శ్రీనగర్: రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 35-ఏ జోలికి వెళ్లడం ఎవరికీ మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. ఆ అధికరణ యథాతథంగా ఉండటం వల్ల కశ్మీర్ ప్రజలు ఎలాంటి అభద్రతకు గురికారని అన్నారు. సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రస్ ఆధ్వర్యంలో ‘జమ్మూకశ్మీర్ పై చర్చ, ఇండో-పాక్ సంబంధాలు’ అంశంపై శనివారంనాడు శ్రీనగర్‌లో జరిగిన సెమినార్‌లో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ, భారత రాజ్యంగంలో 35-ఏ అధికరణ యథాతథంగా ఉండటం వల్లే కశ్మర్ ప్రజలకు భద్రత ఉంటుందని తన అభిమతమని, కశ్మీర్ ప్రజలు 90 ఏళ్లుగా ఆ హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. త‌ద‌నంతరం మీడియాతో మాట్లాడిన అయ్యర్, ఆర్టికల్ 35-ఏ అంశాన్ని ఏమాత్రం ముట్టుకోరాదన్నారు. ‘ఆ ఆర్టికల్ మన రాజ్యంగంలో ఉంది. దాన్ని రద్దు చేసే ప్రయత్నం ఎవరూ చేయరాదు. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలకూ దీనికి ముడిపెట్టరాదు’ అని అన్నారు. అయ్యర్‌పై గత ఏడాది విధించిన నిషేధాన్ని కాంగ్రెస్ పార్టీ గత శనివారంనాడు ఎత్తివేసింది.