ఆ ఆరోప‌ణ‌లు అవాస్త‌వంః గుత్తా

G.Sukhendar reddy
G.Sukhendar reddy

హైదరాబాద్: పాసుపుస్తకాల ముద్రణకు రూ. 90 కోట్లు కేటాయిస్తే రూ. 80 కోట్ల అవినీతి ఎలా జరిగిందని రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. పాసుపుస్తకాల ముద్రణలో భారీ అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపణలపై ఎంపీ స్పందించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రైతులకు చెక్కులతో పాటు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. చెక్కులు తీసుకోని వారి నిధులను తిరిగి రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. ఆ డబ్బును తిరిగి రైతు సంక్షేమ కోసం ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు.