ఆహార నిల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం

SURESH PRABHU
SURESH PRABHU

ఆహార నిల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం

డబ్ల్యుటిఒ సదస్సు నేపథ్యంలో సురేష్‌ ప్రభు డిమాండ్‌
బ్యూనస్‌ ఎయిర్స్‌, డిసెంబరు11: ఆదివారం ప్రారంభం కానున్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటివో) 11వ మంత్రుల సమావేశంలో ప్రభుత్వ ఆహార నిల్వల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొని తీరాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ ప్రభు అభిప్రాయపడ్డారు.

ఈ శాశ్వత పరిష్కారం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు తక్కువ అభివృద్ధి చెందిన దేశాల అన్నింటి ప్రస్తుత, భవిష్యత్తు కార్యక్రమాలన్నింటికీ వర్తించేదిగా ఉండాలని, ఎందుకంటే ఇది కోట్లాది పేద ప్రజల బతుకుదెరువులకు సంబంధించిన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల్లో పాల్గొనడం కోసం బ్యూనస్‌ ఎయిర్స్‌ చేరుకున్న సురేష్‌ ప్రభు జి-33 గ్రూప్‌ దేశాల సమావేశానికి హాజరైన తర్వాత వరుస ట్వీట్లలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జి-33 గ్రూపులో 47 అభివృద్ధి చెందుతున్న దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

వీటన్నింటి లక్ష్యాలు, సమస్యలు ఒకటే కావడం విశేషం. ప్రధానంగా ఆహార భద్రత, రైతుల జీవితాలకు సంబంధించిన సమస్య లపై పోరాడడంలో ఈ గ్రూపు మొదటి నుంచి ముందువరుసలో ఉంటోంది. ప్రభుత్వ ఆహార నిల్వల సమస్యపై అన్ని దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని సురేష్‌ ప్రభు అంటూ ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుదీన్ని ఒక ముఖ్యమైన అంశంగా చూస్తు న్నాయని, ఎందుకంటే ఈ దేశాల్లో వ్యవసా యం చాలా వరకు వర్షాలపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు.

ఈ దేశాల్లోని కోట్లాది మంది పేద ప్రజలకు రెండుపూటలా కడుపు నిండా తిండి లభించాలంటే ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలను నిల్వ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. అలాగే దిగుమతులు పెరిగినప్పుడు, ధరలు పడిపోయినప్పుడు అభివృద్ధి చెందు తున్న దేశాలు వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందచేయాల్సి ఉంటుందని ఈ సమస్యను అధిగమించడానికి ఒక ప్రత్యేక రక్షణల వ్యవస్థ అవసరమని కూడా ప్రభు అన్నార