ఆహారపు అలవాట్లతో నిత్యయవ్వనం

Eating
Eating

ఆహారపు అలవాట్లతో నిత్యయవ్వనం

ఎప్పటికైనా అన్ని వయసులూ దాటుకుని వద్ధాప్యంలోకి అడుగు పెట్టక తప్పదు. కానీ వద్ధాప్యంలో పడ్డాక కూడా ‘మీకు ఇంత వయసున్నట్టు కనబడరు అనే మెచ్చుకోలు పొందామంటే అది మన ఆరోగ్యాన్నీ, ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. ఇంకా అనవసరపు ఆందోళనలకు లోనుకాకుండా, పొల్యూషన్‌ బారిన పడకుండా ఉంటే కాలాన్ని పది- పదిహేనేళ్లు వెనక్కు తిప్పుకోవచ్చు. చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన శరీర సౌందర్యానికి చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించాలి.

ఆహారంలో నూనెలు, కొవ్వులు, కోలాలు, కాఫీలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారి శరీరతత్వం సౌందర్యాన్నే సూచిస్తుంది. మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినవి జత చేసుకుంటే ‘మీరే కాలేజి అనిపించుకోవడం ఖాయం. ఇవన్నీ రోగనిరోధకశక్తిని పెంచేవే కాక జీర్ణక్రియచక్కగా పనిచేయడానికి ఉపయోగపడతాయి.

మీ ఆహారంలో అవి ఎంత శాతం ఉంటున్నాయో ఒకసారి చెక్‌ చేసుకోండి. ప్రకతి ప్రసాదితాలు పళ్ళు-కూరలు క్యాబేజీ, బ్రొకోలీ, ముల్లంగి, ఉసిరి, క్యారెట్‌ ఇవన్నీ విటమిన్లు సమద్ధిగా గల కూరగాయలు. విటమిన్‌ ఎ, సిలు కంటిచూపుకు, కంటికి సంబంధించిన జబ్బులనుంచి రక్షణనిస్తాయి.

పాలకూర లేదా ఇతర ఆకుకూరలన్నీ శరీరానికి కావలసిన ఐరన్‌ను అందించి అనీమియా బారిన పడకుండా చేస్తాయి. సమృద్ధిగా పోషకాలను అందించే కళ్ళకింపైన రంగులున్న కూరగాయలు గుండెజబ్బులను, మానసికవత్తిడి, డిజార్డర్స్‌ వంటి సబ్బుల నుంచి రక్షణనిస్తాయి. ఇంకా కేన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా వీటిలో ఉన్నాయి.

ఇక పళ్ల విషయానికొస్తే బొప్పాయి, అరటిపండు, సపోటాల్లో ఐరన్‌, పొటాషియం, విటమిన్‌ ‘ఇ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి నిగారింపునిచ్చి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. కూరగాయలు ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న పోషకాలు, ఖనిజాలు నష్టపోతాం.

టమాటా:
అధిక రోగనిరోధక శక్తిగల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు కేన్సర్లను అరికడుతుంది. ఇందులో ‘ఎ, ‘ఇ విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీ పార్లలో ఫేస్‌మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు.

వెల్లుల్లి:
రోగనిరోధక శక్తిని పెంచే మరొక దినుసు వెల్లుల్లి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును కూడా అరికడుతుంది. చర్మరోగాలకు చక్కని మందు వెల్లుల్లి. ఇది హృదయ సంబంధిత వ్యాధులకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. ఈ వాసన పడని వారు మొదటి చాలా తక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకేసారిగా ఎక్కువ మొత్తం తీసుకుంటే వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎండుఫలాలు:
బాదం, పిస్తా, జీడిపప్పుల్లో విటమిన్‌ ఇ, ఐరన్‌, పొటాషియమ్‌, జింక్‌, ఒమెగా-3 ఫాటీ ఆసిడ్స్‌ ఉంటాయి. ఇవన్నీ శరీర సౌందర్యాన్ని పెంచేవి. ఇందులో ఉండే నూనెలో ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఉపకరిస్తాయి.

పెరుగు-తేనె:
పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. ఇది అరుగుదలను మెరుగుపరిచే ఆహారం. తేనె శక్తినిచ్చే ఔషధం.