ఆహారం తీసుకోకపోవడం ఒక రోగమే

PAIN
PAIN

ఆహారం తీసుకోకపోవడం ఒక రోగమే

మనందరమూ జీవించడానికి ఆహారం తీసుకుంటాం. మనం తినే ఆహా రాన్ని ఎంతో ఆనందంగా భుజిస్తాం. అయితే మనుష్యుల ప్రవర్తనలలో కనిపించే వైవిధ్యాలలాగా వారి ఆహార విషయాల్లోనూ వైవిధ్యాలు ఉండ వచ్చు. కొంతమంది ఎక్కువగా భుజించవచ్చు. మరికొందరు తక్కువగా తినవచ్చు. కొంతమందిత్వరగా స్థూల కాయులు కావచ్చు.

ఇంకొంతమంది లో ఎంత తిన్నా స్థూలకాయం వారి దరిదాపులకు రాకపోవచ్చు. అయితే, కొంతమంది సన్నగా ఉండాలనే భావనతో శరీరా వసరాలకు కూడా సరి పోని స్థాయిలో అతి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఇటువంటి వారి విషయంలో వైద్య సహాయం అవసరం కావచ్చు. ఎందుకంటే వీరు అనొరె క్సియా నెర్వోసా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న వారై ఉండవచ్చు. ఈ పరిస్థితి మహిళలలో సాధారణంగా కనిపి స్తుంది. ముఖ్యంగా యువతలో ఇది మరింత ఎక్కువ.

లక్షణాలు : – స్థూలకాయం వస్తుందనే భయం – అతి తక్కువగా తినడం – తీవ్రస్థాయిలో బరువు కోల్పోవడం – స్థాయిని మించి వ్యాయామం చేయడం – మహిళల్లో రుతుక్రమంలో లోపాలు అనొరెక్సియా నెర్వోసా అనే పరిస్థితి యవ్వనంలోకి అడుగుపెట్టిన కొన్నాళ్లకు కనిపిస్తుంది.

ఇదిసాధారణంగా ఉన్నతాదాయ వర్గాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాల అమ్మాయిల్లో డైటింగ్‌ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. కొంతమంది అమ్మాయిలు త్వరితగతిన బరువు కోల్పోవాలనే ఉద్దేశ్యంతో ఆహారాన్ని తీసుకోవడం మానేస్తారు. ఇదే వారి ప్రధాన కార్యక్రమంగా మారుతుంది. తమ వయస్సు, ఎత్తులతో పోల్చిన ప్పుడు ఉండాల్సిన స్థాయి కంటే తక్కువ బరువు ఉన్నప్పటికీ, కొంతమంది అమ్మాయిలు డైటింగ్‌ చేయడం, తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం చేస్తుంటారు. లేదా డైటింగ్‌ తోపాటు బరువు తగ్గడానికి ఏవైనా మందులు వేసుకుంటూ ఉంటారు.

వీరిలో ఆహా రం పట్ల స్థిరమైన అవాంఛిత ఆలోచనలు (అబ్సెషన్స్‌) ఉంటాయి. ఇటు వంటి వారు ఆహారం తీసుకున్న తరువాత బరువు పెరగకూడ దనే ఆలోచనతో తిన్న ఆహారాన్ని వాంతి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. – ఆహారం తీసుకోకపోవడం వలన కుద్బాధకు గురవుతారు. ఫలితంగా అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదురవుతాయి. – వ్యాకులతకు గురవుతారు. ఏకాగ్రత దెబ్బ తింటుంది. నిద్ర సరిగ్గా పట్టదు. – శరీరంలో పెళుసైన ఎముకలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

శారీరక బలహీనతకు లోనవుతారు. వాంతుల కారణంగా మూర్ఛవ్యాధికి గురికావచ్చు. మూత్రపిండాలు దెబ్బ తినవచ్చు. గుండె కొట్టుకోవడంలో లోపాలు సంభవించవచ్చు. హార్మోన్లలో అసమతుల్య తలు సంభవించి రుతుక్రమంలో మార్పులు వస్తాయి. రుతుక్రమం పూర్తిగా ఆగిపోయే అవకాశాలున్నాయి. అనొరెక్సియాకు కారణమేమిటి ? వీరిపై సామాజికపరమైన వత్తిడి ప్రధాన కారణం. సన్నగా ఉంటే అందం గా ఉంటారనే భావన ఒక కారణమైతే, మీడియాలో వస్తున్న ఫ్యాషన్‌ షోలు వీరిపై ప్రభావం చూపడటం మరొక కారణం. అలాగే ‘బరువు తగ్గండి అనే ఆకర్షణీయమైన ప్రకటనలతో వెలుస్తున్న ‘క్లినిక్‌లు కూడా అమ్మాయిఉల అనొరెక్సియా నెర్వోసాకు గురవడానికి ఇంకొక కార ణం. సన్నగా ఉన్నవారికి సమాజంలో లభించే ప్రత్యేక గుర్తింపు కూడా అమ్మా యిలలో బరువు తగ్గాలనే ఆలోచన కలుగజేసి డైటింగ్‌ చేయడా నికి తద్వారా అనొరెక్సియాకు గురి కావడానికి దోహదం చేస్తున్నది.

నియంత్రణ : డైటింగ్‌ చేయడంవలన ఏదో సాధించామనే భావన కలుగు తుంది. డైటింగ్‌, బరువు తగ్గడాలు రెండూ శరీరం నియంత్రణలోనే ఉందనే భావనను కలిగిస్తాయి. కుటుంబం: తల్లిదం డ్రులు పిల్లల డైటింగ్‌ ను ఆమోదించడమో, లేదాపిల్లలు భోజనం వద్దనడమో అనేక కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులపై కోపాన్ని భోజనం మానివేయడం ద్వారా ప్రదర్శిస్తారు. ఏ కారణంగా కలిగే వ్యాకులత అయినా ఆహారంపట్ల అభిరుచిని తగ్గించవచ్చు.

అయితే వ్యాకులత కలగ డానికిగల కారణాన్ని కనుగొని చికిత్స చేస్తే వారిలో ఆహారం పట్ల ఉన్న నిరాసక్తత తొలగిపోతుంది. ఎలాంటి సహాయం అందించాలి? ఈ సమస్య తక్కువ స్థాయిలో ఉన్న వారికి ప్రత్యేకమైన చికిత్స అవ సరమవుతుంది. అమ్మాయిలు కొంత బరువు తగ్గిన తరువాత సరైన పద్ధతిలో సలహాలివ్వడం ద్వారా వారిలో ఉండే అబ్సెషన్‌ను తొల గించవచ్చు. వయస్సు, ఎత్తులకు తగిన బరువు ఉన్న ప్పటికీ అమ్మా యిల్లో బరువు తగ్గాలనే ఆలోచన ఇంకా స్థిరంగా ఉండి,

డైటింగ్‌, వ్యాయామాలు మొద లైనవి చేస్తుంటే తప్పని సరిగా వారికి వైద్య సహాయం అవసర మవు తుంది. సరైన సమయంలో చికిత్స చేయక పోతే నొరెక్సియా కారణంగా ప్రాణాపాయం కూడా సంభవిం చవచ్చు. అనొరెక్సియాను తొలిదశలోనే గుర్తిస్తే పిల్లలను తిరిగి సంపూర్ణ ఆరోగ్య వంతులుగా చేయడం అంత కష్టమేమీ కాదు.

అనొ రెక్సియా సమస్యతో బాధ పడే వారికి చికిత్సలో మొదటి మెట్టు వారు తమ వయస్సు, ఎత్తుకు సరి పోయే బరువు ఉండేలా చూడటం. పిల్లలు కూడా ఇతర కుటుంబ సభ్యుల తోపాటు తమ శరీరావసరాలకు సరి పోయిన స్థాయి లో ఆహారాన్ని తీసుకునేలా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. అనొ రక్సియా నెర్వోసాతో బాధపడుతున్న రోగికి మానసిక వైద్య నిపుణులతో చికిత్స చేయించడం అవసరం. రోగి సమస్యను మానసిక వైద్య నిపుణుడు సమగ్రంగా తెలుసుకుని, తగిన కారణాల ను కనుగొం టారు. అలాగే రోగిలో అంతర్లీనంగా వ్యాకులత ఉందే మో పరిశీలిస్తారు. తదను గుణంగా చికిత్స చేయడానికి అవకాశముంటుంది.