ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధం

SUNRISERS vs ROYAL CHALLENGERS
SUNRISERS vs ROYAL CHALLENGERS

హైద‌రాబాద్ః సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇటు సన్‌రైజర్స్‌.. అటు బెంగళూరుకు ముఖ్యమైన మ్యాచ్‌కు వేదిక ముస్తాబైంది. ఒక్క విజయం సాధిస్తే సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌కు మరింత చేరువైనట్లే! ఒక్క ఓటమి ఎదురైనా బెంగళూరుకు ప్లేఆఫ్‌ దూరమైనట్లే! చావోరేవో మ్యాచ్‌లో బెంగళూరు, ఆ జట్టు కెప్టెన్‌ కోహ్లి ఏం చేస్తారన్నది ఆసక్తికరం. ఇక వరుసగా నాలుగో విజయంతో ఎదురులేకుండా ఉన్న సన్‌రైజర్స్‌ ఐదో గెలుపుపై కన్నేసింది. బౌలింగే ప్రధానాయుధంగా ప్రత్యర్థుల్ని చిత్తుచేస్తున్న సన్‌రైజర్స్‌.. బెంగళూరుపైనా అదే అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది.