ఆస్పత్రిలో దారుణం

breaking news
breaking news
గుంటూరు: తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది.  పద్మావతి అనే మహిళ నిండు గర్భిణి. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెపై భర్త వీరాస్వామి మద్యం మత్తులో విచక్షణారహితంగా దాడి చేశారు. పద్మ పరిస్థితి విషమంంగా ఉంది. ఆమెను మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతురిని చూసేందుకు వచ్చిన పద్మ తల్లిదండ్రులు, అమ్మమ్మపై కూడా వీరాస్వామి దాడి చేశాడు. మద్యం మత్తులో ఆస్పత్రి సిబ్బందిపైనా దాడికి దిగాడు. ఫర్నిచర్‌ ధ్వంసం చేశాడు. నిందితుడు వీరాస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.