ఆస్తులు అమ్మి అయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాo

JaleellKhan
JaleellKhan

ఎమ్మెల్యేల ఆస్తులు అమ్మి అయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలంతా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, విభిన్నంగా స్పందించిన జలీల్ ఖాన్ విజయవాడలో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. చంద్రబాబు లక్ష్యసాధనకు పోరాడుతామని ఆయన చెప్పారు. పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైతే భిక్షమెత్తుతామని అన్నారు. జోలెపట్టి నిధులు సేకరిస్తామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి తీరుతామని ఆయన అన్నారు. కాగా,