ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు కొత్తవాళ్లకు అవకాశం

SMITH
SMITH

ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు కొత్తవాళ్లకు అవకాశం

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో పరాజయం చెంది టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది.కాగా ఆడిలైడ్‌లో జరుగుతున్న టెస్టులో సమూల మార్పులకు క్రికెట్‌ ఆస్ట్రేలియా శ్రీకారం చుట్టింది.ఇప్పుటికే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా,టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే.కనీసం మూడవ టెస్టులోనైనా గెలువాలనే పట్టుదలతో జట్టులోకి కొత్తవాళ్లను తీసుకుంటున్నట్లు కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ పేర్కొన్నాడు.దీంతో ఆడిలైడ్‌ టెస్టులో రెన్‌షా,జూక్సర్‌ బ్రిడ్‌,పీటర్‌ హెండ్స్‌కోట్‌ ఆసీస్‌ తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నారని స్మిత్‌ పేర్కొన్నాడు.కాగా ఈ ముగ్గురిలో 19 సంవత్సరాల రేన్‌షా ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడకపోవడం విశేషం.ఇప్పటికే ఆస్ట్రేలియా తరపున రెండు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లాడిన నిక్‌ మాడిన్సన్‌కు కూడా జట్టులో చోటు కల్పించామని స్మిత్‌ వెల్లడించాడు.దక్షిణాఫ్రికాతో ఆడనున్న సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లను గెలవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలను చేస్తామని స్మిత్‌ పేర్కొన్నాడు.క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకున్న తాజా నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఈ సిరీస్‌లో ఆసీస్‌ పుంజుకుంటే తమ భవిష్యత్‌ క్రికెట్‌ కూడా బాగుంటుందనే అభిప్రాయానిన స్మిత్‌ వెల్లడించాడు.