ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్‌ సేవలు

STADIUM222
Panting

ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్‌ సేవలు

ముంబయి: గత కొంత కాలంగా పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియాలో కీలక పాత్ర కట్టబెట్ట నున్నారు. ఇందులో భాగంగానే హఠాత్తుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ జట్టు కోచ్‌ పదవికిఇ రాజీనామా చేశారని తెలుస్తుంది.ఆసీస్‌ వరుస వైపల్యాలకు బాధ్యత వహిస్తూ ఇప్పటికే ఆ జట్టు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రాడ్‌ మార్ష్‌ పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో తాత్కాలిక సెలక్టర్‌గా గ్రెగ్‌ చాపెల్‌ను ఎంపిక చేశారు.కాగా ఈ క్రమంలో క్రికెట్‌ ఆస్ట్రేలియాలో మరికొన్ని మార్పులు జరగవచ్చని సమాచారం. ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడైన పాంటింగ్‌ ఐపిఎల్‌ జట్టుకు ఇక కోచ్‌గా వ్యవహరించడని తెలస్తుంది. ఒక పెద్ద ప్రకటన రాబోతుంది అని ఆసీస్‌ మాజీ ఆటగాడు డామియన్‌ మార్టిన్‌ ట్వీట్‌ చేయడం ఇందుకు బలం చేకూరుస్తుంది.దీంతో క్రికెట్‌ ఆస్ట్రేలియాకు సెలక్టర్‌గా గానీ,కోచ్‌గా కానీ పాంటింగ్‌ వచ్చే అవకాశం ఉంది.ఆస్ట్రేలియా జట్టు వరుసగా అయిదు టెస్టులు ఓడిపోవడం,అందులోనూ సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం చెందడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.కాగా ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ ప్రక్షాళన చేసే బాధ్యతను పాంటింగ్‌కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది.1990-2001 మధ్య కాలంలో ఆస్ట్రేలియి క్రికెట్‌ జట్టుకు కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ క్రికెట్‌ అకాడమీ ద్వారా మెరుగైన క్రికెటర్లను అందించడంలో రాడ్‌ మార్ష్‌ కీలక పాత్ర పోషించాడు.కాగా రికీ పాంటింగ్‌ ,ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌,షేన్‌ వార్న్‌,గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ లాంటి క్రికెటర్లతో పాటు సుమారు 27 మంది క్రికెటర్లను ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు అందించాడు.