ఆస్ట్రేలియా క్రికెటర్ల తాజా జాబితా విడుదల

STADIUM11
Australi Team Announced

ఆస్ట్రేలియా క్రికెటర్ల తాజా జాబితా విడుదల

ఆడిలైడ్‌: వరుసగా అయిదు టెస్టు మ్యాచ్‌ల్లో పరాజయం చెందడం దక్షిణాఫ్రికాపై తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాజయంతో ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులకు తావిచ్చింది.కాగా ఆస్ట్రేలియా కోచ్‌ డారెన్‌ లీమన్‌ చెప్పినట్లుగానే కొంత మంది కీలక ఆటగాళ్లపై వేటు పడింది. ఈ క్రమంలోనే ఆరుగురు ఆటగాళ్లకు స్థానం కల్పిస్తూ సెలక్టర్లు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.కాగా ఈ మేరకు దక్షిణాఫ్రికాతో మూడవ టెస్టుకు జాబితా విడుదల చేసింది.ఇందులో 12 మందితో కూడిన ఆసీస్‌ క్రికెటర్లజాబితాను క్రికెట్‌ ఆస్ట్రేలియా విడుదల చేసింది. ఇందులో క్లీన్‌లాండ్‌ ఓపెనర్‌ రెన్‌ షాకుఅవకాశం కల్పిం చగా, మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ పీటర్‌ హ్యాండ్స్‌ కాంబ్‌, నిక్‌ మేడిస ్‌సన్‌లకు చోటు దక్కింది.కాగా మరోవైపు ఫాస్ట్‌ బౌలర్ల జాబితా లో చాడ్‌ సయ్యర్స్‌కు చోటు లభించింది.మరో బౌలర్‌ జాన్సన్‌ బర్డ్‌కు తిరిగి చోటు కల్పించింది.ఇదిలా ఉండగా వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్‌ పునరాగమనానికి రంగం సిద్దమైంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన హూబార్ట్‌ టెస్టులో ఆడి ఆసీస్‌ ఘోర పరాజయానికి కారణమైన జో బర్న్స్‌,ఆడమ్‌ వోజస్‌, కాలమ్‌ ఫెర్గ్యూసన్‌,వేనిల్‌పై వేటు పడింది. ఇలా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆరుమార్పులను చేయడం 1984 తరువాత ఇదే తొలిసారి అప్పుడు వెస్టిండీస్‌లో వైఫల్యం చెందిన సందర్భంగా ఆసీస్‌ జట్టులో ఈ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆసీస్‌ జట్టు స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌),జాక్సన్‌ బర్డ్‌,పీటర్‌ హ్యాండ్‌ స్కాంబ్‌,హజల్‌ వుడ్‌,ఉస్మాన్‌ ఖవాజా,నాథన్‌ లయన్‌,నిక్‌ మాడిన్‌షన్‌,షా,చద్‌ సయ్యర్స్‌,మిచెల్‌ స్టార్క్‌,మాథ్యూ వేడు,డేవిడ్‌ వార్నర్‌.