ఆస్కార్ వేడుక‌లో శ్రీదేవి, శ‌శిక‌పూర్‌కు ఘ‌న నివాళి

shashi kapoor, sridevi
shashi kapoor, sridevi

న్యూయార్క్ః 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. డాల్బీ థియేటర్‌లో ఈ కార్యక్రమాన్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2017, 2018 సంవత్సరాల్లో తుదిశ్వాస విడిచిన ప్రముఖ ఆర్టిస్టుల జ్ఞాపకాలను ఇన్ మెమొరియం సెష‌న్‌లో గుర్తుచేసుకున్నారు. 90వ అకాడమీ అవార్డుల సందర్భంగా దివంగత బాలీవుడ్ సూపర్‌స్టార్లు శశికపూర్‌తో పాటు ఇటీవల మరణించిన అతిలోక సుందరి శ్రీదేవికి కూడా నివాళులర్పించారు. ప్రముఖ అమెరికన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎడ్డీ వెడ్డర్ స్టేజ్‌పైన సంగీత ప్రదర్శనతో వీరికి నివాళులు అర్పించారు. 2017 డిసెంబర్‌లో బాలీవుడ్ లెజెండ్ శశికపూర్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లోని హోటల్ గదిలో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతిచెందిన విషయం తెలిసిందే.