ఆస్కార్‌కు ఎంపికైన ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’

VILLAGE ROCK STARS
VILLAGE ROCK STARS

ముంబై: అస్సామీ సినిమా ఇప్పుడు ఆస్కార్‌కు పోటీ పడనున్నది. రిమా దాస్‌ డైరెక్ట్‌ చేసిన విలేజ్‌ రాక్‌స్టార్స్‌ ఫిల్మ్‌..వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్స్‌ పోటీలకు భారత్‌ తరఫున అర్హత సాధించింది. 2019, ఫిబ్రవరి 24న అకాడమీ అవార్డుల ప్రధానం ఉంటుంది. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ సినిమాను ఆస్కార్స్‌కు ఎంపిక చేయడం విశేషం. కన్నడ ప్రొడ్యూసర్‌ రాజేంద్ర సింగ్‌ బాబు నేతృత్వంలోని జ్యూరీ ఈ సినిమాను ఎంపిక చేసింది. అస్సాంలోని చయ్యాగావ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. డైరెక్టర్‌ రిమాదాస్‌ స్వంత ఊరు ఇదే. పేద పిల్లలకు సంబంధించిన కథాంశంతో చిత్రాన్ని తీశారు. విలేజ్‌ రాక్‌స్టార్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది.