ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం.. మురుగు కాల్వలో ప్ర‌స‌వం

Doctor
Doctor

కోరాపుట్‌(ఒడిశా): ప్రసవానికి వచ్చిన మహిళను చేర్చుకునేందుకు ఆస్పత్రి వర్గాలు తిరస్కరించడంతో ఆ మాతృమూర్తి అదే ఆవరణలో నిరుపయోగంగా ఉన్న ఓ డ్రైనేజీలో ప్రసవించింది. ఈ ఘటన ఒడిశాలోని కోరాపుట్‌లో షాహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. డయానా ముదిలి అనే గర్భిణి శుక్రవారం పురిటి నొప్పులతో ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగాన్ని ఆశ్రయించింది. సంబంధిత పత్రాలు తీసుకురాలేదన్న కారణంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోలేదని మహిళ తల్లి ఆరోపించారు. దీంతో అదే ఆవరణలో నిరుపయోగంగా ఉన్న ఓ డ్రైనేజీలో మహిళ ప్రసవించింది. అనంతరం గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది తల్లీబిడ్డను ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సీతారాం మహాపాత్ర తెలిపారు. అయితే, ఆస్పత్రిలో చేర్చుకోలేదన్న ఆరోపణలను జిల్లా వైద్యాధికారి తోసిపుచ్చారు.