ఆసీస్‌తో తొలి వన్డే భారత్‌ గెలుపు

TEAMINDIA
Team India

చెన్నై: ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై
భారత్‌ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. డక్వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా 21 ఓవర్లలో
164 పరుగులు చేయాల్సి ఉండగా, 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో
ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో అధిక్యం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేన
50 ఓవర్లలో ఏడు వికెట్లకు 281 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం
ఆసీస్‌ టార్గెట్‌ను 21 ఓవర్లలో 164గా అంఫైర్లు నిర్ణయించిన విషయం తెలిసిందే.