ఆసియా మార్కెట్ల మద్దతు

ఆసియా మార్కెట్ల మద్దతు
ముంబై, నవంబరు 23: వారంలో రెండోసారి వరుసగా స్టాక్ మార్కెట్లు లాభాలబాటట్టాయి. బెంచ్‌మార్క్ సూచీలు గరిష్టంగా పెరిగాయి. నవంబరు సిరీస్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ గడువు శుక్రవారంతో ముగుస్తున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆసియా మార్కెట్లు ధోరణులు కూడా కొంత మద్దతునిచ్చా యి. వాల్‌స్ట్రీట్ రెండోసారి వరుసగా రికార్డు బ్రేకింగ్ పెరుగుదల నమోదు చేసింది. బిఎస్ఇ సెన్సెక్స్ 26,051 పాయింట్లకు పెరిగింది. 91 పాయింట్లు లాభపడిందని తేలింది. నిఫ్టీ 60 సూచి 8033 పాయింట్లు పెరిగింది. 31 పాయింట్ల వృద్ధినమోదు చేసింది. బిఎస్ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీ లు 1.22శాతం, 1.54శాతం గరిష్టంగాపెరి గాయి. డాలర్ పటిష్టపడటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిళ్లు వంటివి ఇటీవలి ర్యాలీకి ఆటంకం కలిగించాయి. ముసాయిదా జిఎస్ఇ చట్టంలోని పరిహారం ఫార్ములా, జిఎస్టి మం డలి సమావేశం డిసెంబరు 2-3తేదీలకు వాయిదా వేయడం వంటివి జరిగాయి. దీనివల్ల నే మార్కెట్లు కొంతమేర సడలింపులతో ఎంపిక చేసిన రంగాల్లో కొనుగోళ్లు జరిగాయని జియోజిత్బిఎన్పి పరిభాస్ సేవల వ్యూహకర్త వెల్లడించారు. టెలికాం, రియల్ఎస్టేట్, ఆటో, మెటల్, ఫార్మారంగాలు భారీగా రోలోవర్ అవు తున్నాయి. మదర్‌సన్‌షుమి, స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్, మైండ్‌ట్రీ, భారతి ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూ నికేషన్స్ బాటాఇండియా వంటివి మరింతగా ర్యాలీ కనిపించింది. ఆర్థికరంగం, ముడిచమురుగ్యాస్ రంగాలు కొంతమేర తక్కువగా పెరిగాయి. రియాల్టీ సూచీ పరంగాచూస్తే రెండోసారి పెరిగింది. 3శాతం వరకూ వృద్ధికనిపించింది. ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, ఎన్బిసిసి, యూనిటెక్ సంస్థలు భారీ వృద్ధితో కనిపించాయి. మెటల్ సూచి 2.32శాతం పెరిగింది. ఆరుఖనిజాల సంయుక్త సూచి ఎల్మెక్స్ లండన్మెటల్ ఎక్ఛేంజిలో 1శాతం గరిష్టంగాపెరిగిం ది. జూన్ 15నాటి గరిష్ట స్థాయిని నమోదుచేసింది. సోమవారం 2.3శాతం పెరిగింది. ఇంజనీరింగ్ సంస్థ ఎల్‌అండ్‌టి 4.2శాతం ఇంట్రాడే డీల్స్‌లో పెరిగింది. కంపెనీ 84శాతం నికరలాభాల్లో పెరుగు దలే కీలకం. కంపెనీ 209.69 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెంచుకోగలిగింది. సగటున 855 కోట్ల రూపాయలుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనావేసారు. లూపిన్ సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడింది. నాలుగుశాతం పెరిగింది. కంపెనీ తన జనరిక్ ఎపిజికామ్ మాత్రలకు ఆమోదం లభించిందని ప్రకటించింది. ఇతరత్రా వొకార్డు 52వారాల గరిష్టస్థాయికి చేరింది. 659వద్ద ట్రేడింగ్ నమోదుచేసింది. యుకె విభా గం, సిపి ఫార్యాక్యూటికల్స్ వంటివి అమెరికా ఎ ఫ్డిఎనుంచి హెచ్చరిక లేఖలు అందుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువలు 68.52గా నమోదయింది. యూరోపియన్ వ్యాప్త స్టాక్స్ సూచీ స్టాక్స్ 600 సూచి 0.2శాతం పెరిగింది. ట్రిటన్ కమోడిటి భారీ ఎఫ్టిఎస్ఇ 100 సూచి 0.7శాతం పెరిగింది. ఆసియా మార్కెట్లు కూడా వారం రోజుల గరిష్టస్థాయికి పెరిగాయి. వాల్‌స్ట్రీట్ బుల్‌రన్ మద్దతునిచ్చిం ది. అమెరికా బాండ్ల రాబడులు డాలర్‌కు సానుకూలం కావడం, వర్ధమాన మార్కెట్లకు మరింత ఖరీదైనదిగా డాలర్ మారడం కూడా కొంత ప్రభావంచూపిం చింది. జపాన్మార్కెట్లకు శెలవు ప్రకటించారు. ఆస్ట్రేలియా ప్రధా న సూచి నెలరోజుల గరిష్టస్థాయి కి పెరిగింది. చైనా బ్లూచిప్ సిఎస్ఐ300 సూచీ 0.5శాతం పెరిగింది. 11నెలల గరిష్టస్థాయికి చేరిం ది. యువాన్ ఆరేళ్ల కనిష్టస్థాయికి చేరడమే ఇందుకు కీలకమని అంచనా. మోర్గాన్ స్టాన్లీకేపిటల్ ఇంట ర్నేషనల్ సూచి ప్రకారం ఆసియా పసిఫిక్ షేర్లు జపాన్ బయటి మార్కెట్లలో 0.6శాతం పెరిగాయి.