ఆసియా బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్ సెమీస్‌కు మేరీకామ్‌

mary com
mary com

హోచిమ‌న్ః భారత అగ్రశ్రేణి బాక్సర్‌ ఎంసీ మేరీకామ్‌ ఆసియా మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి మరో పతకం ఖాయం చేసింది. అద్భుత పోరాటంతో సెమీస్‌ చేరింది. 48 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో చైనీస్‌ తైపీ మెంగ్‌ చిహ్‌ పిన్‌ను ఓడించింది. తర్వాతి పోరులో జపాన్‌ బాక్సర్‌ సుబస కొమురతో తలపడనుంది. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మేరీ ఇప్పటికే నాలుగు సార్లు పసిడి, చివరి సారి రజతం కైవసం చేసుకుంది.