ఆసియా క్రీడలకు మేరీకోమ్‌ డుమ్మా

Mary Com-
Mary Com

ఆసియా క్రీడలకు మేరీకోమ్‌ డుమ్మా

ఢిల్లీ: ఆసియా క్రీడలకు స్టార్‌ బాక్సర్‌, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌,లండన్‌ ఒలింపిక్స్‌ కాంప్య పతక విజేత మేరీకోమ్‌ గైర్హాజరు కానుంది.ఈ ఏడాది నవంబర్‌లో ఢిల్లీ వేదికగా జరగనున్న మహిళల ప్రపంచకప్‌ నేపథ్యంలో ఆసియా క్రీడల నుంచి తప్పుకుంది.ఈ విషయాన్ని ఇటు బాక్సింగ్‌ సమాఖ్య,అటు మేరీకోచ్‌ ధ్రువీకరించారు.లండన్‌ ఒలింపిక్స్‌లో 51 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన మేరీకోమ్‌ ఇటీవల 48 కేజీల విభాగంలో పోటీ పడుతోంది.దీంతో ఆసియా క్రీడల్లో సైతం 51 కేజీల కేటగిరీలో బరిలోకి దిగాల్సి వస్తోంది.అయితే తగినంత సమయం లేక పోవడంతో ఆ విభాగంలో బరిలోకి దిగేందుకు ఇష్ట పడడం లేదు.పైగా తక్కువ వ్యవధిలో బరువు పెరగం అసాధ్యమని మేరీకోమ్‌ అభిప్రాయపడుతోంది.తన లక్షం ప్రపంచ కప్‌లో పతకం సాధించడమేనని వెల్లడించింది.ఇందుకోసం ఆసియా క్రీడలకు దూరమైనట్టు పేర్కొంది.ఆసియా క్రీడల కంటే ప్రపంచకప్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.ఐదు సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన మేరీ కోమ్‌ ఆరో సారి 48 కేజీల విభాగంలో నెగ్గి రికార్డు సృష్టిచేందుకు ఉవ్విళ్లూరుతోంది.