ఆసియాలో అదరగొట్టిన అమ్మాయిలు

                  ఆసియాలో అదరగొట్టిన అమ్మాయిలు

SWAPNA
SWAPNA

అనుకున్నట్లుగా మన మహిళలు ఆసియాక్రీడల్లో అదరగొట్టెస్తున్నారు. బంగారు, రజతం, కాస్యపతకాలతో దేశప్రతిష్ఠను మరింతగా పెంచుతున్నారు. ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో మనదేశ మహళలు ఆయాక్రీడల్లో పాల్గొని తమ సత్తాను చాటుతున్నారు. రియో ఒలెంపిక్స్‌ గేమ్స్‌లో మహిళలే మనదేశ పరువ్ఞను నిలబెట్టారు. ఇప్పుడు పురుషులతోపాటు మహిళలు కూడా పతకాలపంటను పండిస్తున్నారు. వీరిలో అథ్లెటిక్స్‌లో స్వప్న, హిమదాస్‌, పూవమ్మ, గైక్వాడ్‌, విస్మయలు 400 మీటర్లలో బంగారు పతకాలను సాధించి, నేటి వనితలకు ఆదర్శంగా నిలిచారు. పతకాలను సాధించిన వనితల ప్రతిభను మరోసారి గుర్తుచేసుకుందాం…

పేదకుటుంబం నుంచి వచ్చిన ఆణిముత్యం స్వప్న
దేశంలో చాలామంది క్రీడాకారుల మాదిరే హెప్టాథ్లెట్‌ స్వప్న బర్మన్‌దీ దుర్భర దారిద్య్రం. పశ్చిమ బెంగాల్‌లోని జలపా§్‌ు గురి పట్టణ సమీప ఘోసాపార అనే పల్లెటూరు ఆమె స్వస్థలం. తండ్రి పంచానన్‌ బర్మన్‌ రిక్షావాలా. తల్లి బసానా ఇంటింటా పనులు చేయడంతో పాటు తేయాకు తోటలో కూలీగా పని చేస్తోంది. వీరికి నలుగురు సంతానం. తండ్రి గత ఏడాది గుండె నొప్పితో మంచాన పడడంతో ఆ కుటుంబం పరిస్థితి మరింత దైన్యంగా మారింది. చిన్ననాటి నుంచీ ఆటలంటే మక్కువ ప్రదర్శించే స్వప్న ..రాహుల్‌ ద్రావిడ్‌ అథ్లెటిక్స్‌ మెంటార్‌షిప్‌ ప్రోగ్రాం కింద గో స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా శిక్షణ పొందుతోంది. మిగతా అథ్లెట్లకు బర్మన్‌ భిన్నం. ఆమె ఒక్కో కాలికి ఆరేసి వేళ్లుంటాయి. వాటికి తగ్గట్టుగా షూ లేకపోవడంతో సాధారణ ఆటగాళ్లు వేసుకునే బూట్లనే ధరిస్తూ ఆమె ప్రాక్టీస్‌ చేస్తుంటుంది. ఆ బూట్లతో నొప్పిగా ఉన్నా ఆమె దానిని భరిస్తూ వస్తోంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించడంతో ఏదైనా సంస్థ తనకు సరిపోయే షూ తయారు చేస్తుందన్న ఆశాభావంతో స్వప్న ఉంది. ఇక..బర్మన్‌ పసిడి పతకం గెలిచిందన్న వార్త తెలిసిన మరుక్షణం ఆమె కుటుంబం ఆనందోత్సాహాలలో మునిగిపోయింది. గ్రామ ప్రజలంతా బర్మన్‌ ఇంటికి క్యూకట్టారు.
పతకం పొందిన తీరు
ఓవైపు భరించలేని పంటి నొప్పి. బుగ్గమీద ప్లాస్టర్‌. అయితే దేశానికి పతకం అందించాలన్న ఆమె లక్ష్యం ముందు ఆ నొప్పి చిన్నబోయింది. స్వప్న బర్మన్‌ పట్టుదలకు పసిడి పతకం దాసోహమంది. ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్‌ స్వర్ణ స్వప్నాన్ని ఎట్టకేలకు బర్మన్‌ సాకారం చేసింది. ఆ పతకంతో ఆమె చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఏడు అంశాల సమాహారమైన హెప్టాథ్లాన్‌లో మొత్తం 6026 (కెరీర్‌ బెస్ట్‌) పాయింట్లతో టైటిల్‌ చేజిక్కించు కుంది. రజతంతో మెరిసిన ద్యూతీ ద్యూతీ మరోసారి..ఒడిశా స్టార్‌ స్ప్రింటర్‌ ద్యూతీచంద్‌ టోర్నీలో రెండో పతకం సాధించింది. ఇప్పటికే వందమీటర్ల రేసులో రజతం నెగ్గిన ద్యూతీ ..200మీ. పరుగులో 23.20 సె.లతో రజత పతకం కైవసం చేసుకుంది. పసిడి పతకం నెగ్గిన బహ్రెయిన్‌ అథ్లెట్‌ ఎడిడాంగ్‌ ఒడియోంగ్‌ కంటే ఆమె కేవలం 0.149 సెకన్లలో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.
అద్భుత ప్రతిభ కనబర్చిన మనమ్మాయిలు
మహిళల 400 మీటర్ల రిలేలో మరో స్వర్ణం లభించింది. రిలేలో పోటీపడిన హిమదాస్‌, పూవమ్మ, గైక్వాడ్‌, విస్మయ అద్భుత ప్రదర్శనతో రేసుని 3:28:72 సెకన్లలో పూర్తి చేసి ఔరా అనిపించారు. మహిళల 400 మీటర్లలో హిమదాస్‌ 50.79 సెకన్లలో గమ్యాన్ని ఛేదించి రజత పతకాన్ని దక్కించుకుంది.
పూనియాకు కాంస్యం దాసోహం
డిస్కస్‌త్రో విభాగంలో హర్యానాకు చెందిన పూనియా 62:26 పాయింట్లతో కాంస్యపతకం దక్కించుకుంది. మొత్తం పలు రౌండ్లలో సీమా మొదటిసారి 58:51 మీటర్లు రెండోసారి ఫౌల్‌గా వెనుదిరిగింది. 62.26 మీటర్లు లుగోసారి 61.28 మీటర్లు విసిరి మంచి స్కోరు సాధించగలిగింది. సమా పూనియా 17 ఏళ్లనాటికే జూనియర్‌ కాంపిటేషన్‌లో స్వర్ణాన్ని గెలుచుకున్నారు.

సైనానెహ్వాల్‌కు కాంస్యం

Saina Nehwal
Saina Nehwal

మహిళల బాడ్మింటన్‌లో షట్లర్‌ సైనా నెహ్వాల్‌ సెమీస్‌లో పరాజయం పొంది కాంస్యంతో సరి పెట్టుకుంది. కాగా, సెమీస్‌లో ఓటమి చెందిన సైనా నెహ్వాల్‌ కాంస్య పతకం చేజ్కించుకుంది. తైజుయింగ్‌ చేతిలో 17-21,14-21 స్కోరుతో వరుస సెట్టలో సైనా పరాజయం పొందింది. అయితేనేం తన ప్రతిభతో భారతదేశానికి మరో పతకాన్ని సాధించిపెట్టింది.

సింధుకు రజతం

P V Sindhu
P V Sindhu

 సింధు ఈసారి బంగారుపతకం తెస్తుందని అందరూ ఊహించారు. కానీ కాస్త నిరాసపర్చినా రజతపతకాన్ని పొందారు. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్‌ వన్‌ షట్లర్‌ తైజు యింగ్‌పై 13-21, 16-21తేడాతో పోరాడి ఓడిపోయింది. మ్యాచ్‌ అనంతరం పివి సింధు మాట్లాడుతూ ఓడిపోయే ఎన్నో మ్యాచుల్లో నేను పోరాడి గెలిచాను. కానీ ఈ పోటీ చాలా అద్భుతంగా ఉంది. గోల్డ్‌ మెడల్స్‌ గెలవలేదని నాకు బాధగా లేదు. మెడల్‌ పోడియంపై ఇద్దరు భారతీయులు ఉండటం ఎంతో గర్వంగా ఉందని తెలిపింది. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌లో ఓటమిపాలై సింధు రజత పతకానికి పరిమిత మైంది. ఆసియా గేమ్స్‌ సింగిల్స్‌ విభాగంలో ఓ భారత షట్టర్‌ ఫైనల్స్‌లోకి చేరుకోవడం ఇదే తొలిసారి. 1982 తర్వాత సింగిల్స్‌లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు సైనా నెహ్వాల్‌ సెమీస్‌లోనే ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

ముస్కన్‌ కిరార్‌

MUSKAN KIRAR
MUSKAN KIRAR

18వ ఆసియా గేమ్స్‌ ఆర్చరీ టీమ్‌ ఈవెంట్‌లో రజతం సాధించిన క్రీడాకారిణి ముస్కన్‌ కిరార్‌కు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రూ.75లక్షల నజరానా ప్రకటించింది. మహిళల కాంపౌండ్‌ ఈవెంట్లలో భారత మహిళల ఆర్చరీ జట్టు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. చివరి షాట్‌ దాకా పోరాడిన జ్యోతి సురేఖ, మధుమిత, ముస్కన్‌ కిరార్‌లతో కూడిన భారత బృందం తృటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. 231-228 పాయింట్ల తేడాతో ఓటమి పాలైన ఆర్చరీ జట్టు, రజత పతకంతో సరిపెట్టుకుంది. మూడో సెట్‌లో ఇరు జట్లు 58, 58 పాయింట్లు సాధించడంతో రసవత్తరమైన పోటీ నెలకొంది. రజతం గెలిచిన జట్టులో మధ్యప్రదేశ్‌కు చెందిన ముస్కన్‌ సభ్యురాలు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.75లక్షల నజరానా ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ముస్కన్‌…జబల్‌ పూర్‌ జిల్లాకు చెందిన క్రీడకారిణి. ఆసియా గేమ్స్‌లో ఆమె సాధించిన పతకంతో రాష్ట్రంతో పాటు దేశం గర్వపడుతోంది. ఈ సందర్భంగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం రూ.75లక్షల నజరానా అందజేయ నుందని ట్విట్టర్‌లో ప్రకటించారు.