ఆసనాలతో నొప్పి నివారణ

                                  ఆసనాలతో నొప్పి నివారణ

PAIN
PAIN

ఎక్కువసేపు కూర్చున్నా, నిల్చున్నా నడుమునొప్పి కొందరిని బాధిస్తాయి. వాటిని నివారించడానికీ కొన్ని ఆసనాలు ఉన్నాయి.
గరుడాసనం: నిలబడి పాదాల్ని దగ్గరగా ఎడమ మోకాలి మీదుగా ఉంచాలి. ఎడమ మోకాలిని కొద్దిగా వంచాలి. కుడికాలి వేళ్లను ఎడమచేతిని కింద ఉంచి, కుడి చేతిని దానిపై నుంచి తీసుకుని అరచేతుల్ని కలిపి చిత్రంలోలా పైకెత్తాలి. ఈ స్థితిలో పది నుంచి ముప్పై సెకన్ల వరకూ ఉండి ఇదేవిధంగా ఎడమకాలితోనూ చేయాలి. ఈ ఆసనం వల్ల కీళ్లకూ, కండరాలకూ బలం చేకూరుతుంది. కీళ్లనొప్పులు తగ్గుతాయి.
కీటశక్తి ఆసనం: నిల్చుని కాళ్లను సాధ్యమైనంతవరకూ దూరంగా ఉంచాలి. రెండు చేతుల్ని నడుము మీద ఉంచాలి. అయితే బొటనవేలు ముందుకూ, మిగతా వేళ్లు వెనక్కీ ఉండేలా పెట్టాలి. శ్వాస వదులుతూ నడుమును ముందుకు వంచాలి. ఈక్రమంలో పిరుదుల్ని వెనక్కి ఉంచి, శరీరాన్ని ముందుకు తొంభై డిగ్రీల్లో వంచి ముందుకు చూస్తుండాలి. పది సెకన్లయ్యాక శ్వాస తీసుకుంటూ, పైకి లేవాలి. ఇలా మూడుసార్లు చేయాలి. తరువాత మూడుసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నడుమును వెనక్కి వంచాలి. ఉండగలిగినంత సేపూ ఆ స్థితిలో ఉండి మెల్లగా శ్వాస వదులుతూ యధాస్థితికి రావాలి. ఇలా మూడుసార్లు చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల నడుమునొప్పులు దూరం అవ్ఞతాయి. మోకాళ్లూ, కాలిమడమల దగ్గర కండరాలకు రక్తప్రసరణ బాగా అందుతుంది. కీళ్లనొప్పులు తగ్గుతాయి.
వాయు ముద్ర : ముందుగా సుఖాసనంలో కానీ, కుర్చీలో గానీ కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. మిగతా మూడువేళ్లూ ముందుకు చాచి చేతుల్ని తొడలపై ఆసరాగా ఉంచాలి. కళ్లు మూసుకుని శ్వాసమీద ధ్యాస ఉంచాలి. కీళ్లనొప్పులు ఎక్కువగా ఉంటే ఈ ముద్రను ప్రతిరోజూ మూడుసార్ల చొప్పున ఐదు, పదినిమిషాలు చేయాలి. నొప్పులు తగ్గిన తరువాత ఈ ముద్రను చేయడం ఆపేయాలి. కీళ్లనొప్పులు ఉన్నవాళ్లు ఈ ముద్ర వేసేప్పుడు చింతపండు తినకూడదు.