ఆశించిన తెలంగాణ సాధించేవ‌ర‌కు జేఏసీ ఉంటుందిః హ‌ర‌గోపాల్

Haragopal
Haragopal

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తార్నాకలోకి తన నివాసంలో చేపట్టిన దీక్షకు సామాజిక హక్కుల నేత హరగోపాల్ సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రస్తుత వ్యవస్థలో సమస్యలకు పరిష్కారం దొరక్కపోతే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని అన్నారు. తెలంగాణలో సాయుధ పోరాటం, శాంతియుత ఉద్యమం జరిగిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. శాంతియుత ఉద్యమాలను అణచివేస్తే ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఆశించిన తెలంగాణ సాకారమయ్యేంత వరకు జేఏసీ ఉంటుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక ఉద్యమాలను మర్చిపోవడం సరికాదని హితవు పలికారు.