ఆశా వ‌ర్క‌ర్ల వేత‌నాలు పెంచుతాంః కేసిఆర్‌

KCR
KCR

హైద‌రాబాద్ః కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ సాయాన్ని మరింత పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడున్న రూ. 75 వేల నుంచి మరింత పెంచి నిరుపేద కుటుంబాల ఆడబిడ్డలకు చేయూత అందిస్తామన్నారు. ఆశా వర్కర్లకు కూడా జీతాలు పెంచబోతున్నాం. కల్యాణలక్ష్మీ సాయం, ఆశా వర్కర్ల వేతనాల పెంపునకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. హోంగార్డులకు రూ. 20 వేల జీతం ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని తెలిపారు. మన జీతాలను చూసి మహారాష్ట్రలోని హోంగార్డులు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో గొడవ పడుతున్నారని చెప్పారు.