ఆశా వర్కర్ల పారితోషికాన్ని పెంచిన సర్కార్‌  

ASHA WORKERS
ASHA WORKERS

హైదరాబాద్ : తెలంగాణలో ఆశా వర్కర్లకు అక్టోబర్‌ నుంచి రూ.7,500ల పారితోషికాన్ని  ఇవ్వనున్నట్లు  డిస్ట్రిక్‌ పబ్లిక్‌ హెల్త్‌ నర్సింగ్‌ అధికారి శేషుపద్మ తెలిపారు.  ఆమె జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో మాట్లాడుతూ వైద్యశాఖలో ఆశాలు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు వీరు కృషి చేస్తున్నారన్నారు. వీరికి ఇప్పటివరకు రూ.6,500ల పారితోషికాన్ని చెల్లిస్తుండగా, ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నుంచి రూ.7,500లకు పెంచుతూ సర్కార్‌ నిర్ణయం తీసుకుందన్నారు.  పారితోషికం పెంచడంపట్ల ఆశాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.