ఆశలు నిలుపుకోని ధావన్‌

DHAWAN
కోల్‌కతా : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ త్వరగా ఔట్‌ కావడంపై ట్విటర్‌లో జోకులు పేలుస్తున్నారు. కాగా టెస్టు మ్యాచ్‌లో ధావన్‌ ఇప్పటి వరకు పెద్దగా సత్తా చాటలేక పోయాడు. కెఎల్‌ రాహుల్‌ గాయాల పాలు కావడంతో అతని స్థానంలో ధావన్‌ తుది జట్టులోకి వచ్చాడు.
కొత్తగా టీంలోకి వచ్చిన పాత ఓపెనర్‌ గంభీర్‌ను పక్కన పెట్టి కోహ్లీ ధావన్‌ను ఎంచుకున్నాడు. అయితే అతను తన కెప్టెన్‌ ఆశలను నిలబెట్టుకోలేకపోయాడు. న్యూజిలాండ్‌ బౌలర్‌ మట్‌ హెన్రీ తొలి ఓవర్‌లోనే ధావన్‌ ఔటయ్యాడు. హెన్రీ వేసిన బంతి ధావన్‌ బ్యాట్‌ లోపలి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ తాకింది. దీంతో ధావన్‌ ఒక్క పరుగుచేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీనిపై క్రికెట్‌ అభిమానులు ట్విటర్‌లో జోకులు వేస్తున్నారు.