ఆల్ఫా హోటల్‌ ఆహరంలో నాణ్యతా ప్రమాణాల లోపం

fraud
fraud

విజయవాడ: విజయవాడలో బెంజ్‌సర్కిల్‌, టికిల్‌ రోడ్డులోని ఆల్ఫా హోటళ్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ హోటళ్లలోని ఆహార పదార్ధాలలో నాణ్యతా ప్రమాణాల పాటించడం లేదని గుర్దించారు. బెంజ్‌ సర్కిల్‌లోని ఆల్ఫా రెస్టారెంట్‌కు లైసెన్సు లేదని గుర్తించారు. అంతేకాక ముందు రోజు వంటకాలను కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాల్లో ప్రమాదకరమైన రంగులు వినియోగిస్తున్నారని, అపరిశుభ్రత వాతావరణంలో వంటకాలు తయారీ చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో బెంజ్‌సర్కిల్‌లోని ఆల్ఫా రెస్టారెంట్‌ను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ప్రకటించారు.