ఆలోచింప‌జేసేలా ‘పంతం’

GOPI CHAND
GOPI CHAND

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై కెకె రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘పంతం.. గోపీచంద్‌ నటిస్తున్న 25వ సినిమా. .కె.చక్రవర్తి ఈచిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చెప్పుకోవటానికి ఇదేం కొత్తకథ కాదు.. దేశం పుట్టినప్పటి నుంచి మనం చెప్పుకునే కథ. అంటూ పంతం టీజర్‌ మంగళవారం విడుదలైంది.. టీజర్‌లో ఇప్పటికైనా చెప్పండి. మీరేం చేస్తుంటారు.. అని పృధ్వీ అడిగితే లోపలున్నది బయటికి తీస్తాం. బయటున్నది లోపలికి తోస్తాం.. టింగ్‌ టింగ్‌ అని గోపీచంద్‌. శ్రీనివాసరెడ్డి చెప్పే తీరు కడుపుబ్బా నవ్విస్తోంది. కోర్టులో నిలుచుని గోపీచంద్‌ చెప్నే ఫ్రీగా ఇల్లిస్తాం.. కరెంట్‌ ఇస్తాం. రుణాలు మాఫీ చేస్తాం.. ఓటుకు ఐదు వేలు ఇస్తాం.. అని అనగానే ముందు. వెనుకా మంచి చెడూ ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి. కరెప్షన్‌ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయం? అనే డైలాగు అర్ధవంతంగా, ఆలోచింపజేసేలా , భావోద్వేగపూరితగా ఉంది.. కమర్షియల్‌ చిత్రాలకు ఉండాల్సిన అన్ని రకాల అంశాలతో సినిమా అద్భుతంగా తెరకెక్కిందని టీజర్‌ చెప్పకనే చెబుతోంది.. పంతం గురించి నిర్మాత రాధామోహన్‌ మాట్లాడారు.. గోపీచంద్‌ నటిస్తున్న 25వ చిత్రాన్ని మా బ్యానర్‌లో నిర్మించటం చాలా ఆనందంగా ఉందన్నారు.. వినోదాత్మకమేకాకుండా ఆలోచింపజేసేవిధంగా అంశాలు కూడ పుష్కలంగా ఉన్నాయన్నారు. టాకీ పూర్తయిందని, ప్రస్తుతం పాటలను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూలై 5న సినిమాను విడుదల చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు. ఇందులో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.