ఆలోచనల్ని అదుపులో పెట్టుకోండి!

వ్యధ

lady222
Thinking

ఆలోచనల్ని అదుపులో పెట్టుకోండి!

నా వయస్సు 21 సంవత్సరాలు. ఎం.బి.ఎ. చదువుతున్నాను. మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. అమ్మా, నాన్నలది మేనరికం. అమ్మకు ఇష్టం లేకపోయినా వారి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారట. దానివల్ల ఆమె చదువ్ఞ మధ్యలోనే ఆగిపోయింది. ఎన్నో ఆశయాలు వ్ఞన్నప్పటికి విధిలేక మా అమ్మ వంటింటికే పరిమితమయ్యింది. ఆమె ఎల్లప్పుడు అంతర్గత సంఘర్షణకు గురవ్ఞతూనే ఉంటుంది. మా అమ్మ జీవితాన్ని చూసిన తరువాత నేను స్వతంత్రంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాను. మేనరికాలు, పెద్దలు కుదిర్చిన పెళ్లిల్ల పట్ల వ్యతిరేకత పెంచుకున్నాను. నాకు తగిన వ్యక్తిని చూసి ప్రేమించి పెళ్లాడాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నాను. నాకు కాబోయే భర్త నాకంటే ఎక్కువ చదువ్ఞకోవాలని సంపాదనా పరుడై వ్ఞండాలని భావించాను.

అన్నివిధాలా నాకంటే అధికుడై వ్ఞండాలని కాంక్షించాను. అయితే ఈ ఆశ రెండుసార్లు అవహేళనకు గురయ్యేలా చేసింది. నేను బి.టెక్‌ మూడో సంవత్సరంలో వ్ఞండగా ఫైనల్‌ ఇయర్‌ అతన్ని ఇష్టపడ్డాను. అన్ని విషయాలలో చాలా చలాకీగా ఉంటాడు. చూడటానికి ఆకర్షణీయంగా వ్ఞంటాడు. మంచి కుటుంబ నేపధ్యం వ్ఞంది. అతను భర్త అయితే బాగుంటుందని భావించాను. పరిచయం పెంచుకుని స్నేహం చేశాను. ఏడాది చివరిలో నా మనస్సులో మాట చెప్పాను. దానికి అతను సున్నితంగా తిరస్కరించాడు. పెళ్లి పట్ల తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్పాడు. తన ఆలోచనలకు నేను దగ్గరగా లేనని, పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని తేల్చి చెప్పాడు. దీంతో నా అహం దెబ్బతిన్నది. మనసు వికలం చెంది, చదువ్ఞలో కొంత వెనుకబడ్డాను. స్నేహితుల ఓదార్పు, హితుల కౌన్సెలింగ్‌తో నిలదొక్కుకుని బి.టెక్‌ పూర్తి చేసి, ఎం.బి.ఎలో చేరాను. ఇక్కడ మా సీనియర్‌ ఒకతని పట్ల ఆకర్షణ పెంచుకున్నాను.

అతను కోటీశ్వరులకు ఏకైక సంతానం. మా ఆర్థిక పరిస్థితులు, అంతస్థుల అతనికి సరిపోవని తెలుసు. అయినా అతని పట్ల మనసు లాగుతూనే ఉంది. అతనితో నా మానసులోని మాట చెప్పలేకపోతున్నాను. అతను కూడా అంతా విని మొదటి వ్యక్తిలా తిరస్కరిస్తే తట్టుకోలేననిపిస్తుంది. అలాగని అతన్ని మర్చిపోతేకపోతున్నాను. ఈ మానసిక సంఘర్షణ వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవ్ఞతున్నాను. రాత్రి పగలు ఈ ఆలోచనలు నన్ను కలవరపరుస్తున్నాయి. గత కొంతకాలంగా ఆకలి మందగిస్తున్నది. సరిగా తినలేకపోతున్నాను. అలాగే కంటి నిండా నిద్రపోలేకపోతున్నాను. దీనివల్ల నీరసం, నిస్సత్తువ ఆవహిస్తున్నది. తలలో వెంట్రుకలు కూడా విపరీతంగా రాలిపోతున్నాయి. రోజురోజుకు చిక్కిపోతున్న నన్ను చూసి అమ్మా, నాన్నలు అందోళనలు చెందుతున్నారు. కారణం అడిగితే చెప్పలేక హాస్టల్‌ భోజనం సరిపడలేదని అబద్దం చెబుతున్నాను. ఈ నేపధ్యంలో నాకు చక్కని మార్గం చూపండి.
– కోమలి, సికింద్రాబాద్‌

అమ్మా, పెళ్లి పట్ల మీ అభిప్రాయాలు మంచివే కావచ్చు. మేనరికాలు మంచివి కాదని విజ్ఞులందరు అంటున్నారు. అయితే పెద్దలు కుదిర్చే పెళ్లిల్లు మంచివి కావనుకోవడం పొరపాటు. ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే సుఖం అన్నది వందశాతం వాస్తవం కాదు. అసలు ఈ దశలో ఇలాంటి తర్కం చేయడం అసలు మంచిది కాదు. మీరనుకున్నట్టు అన్ని విధాలా మీకంటే ఉన్నతుడిని భర్తగా పొందాలనుకోవడం మంచిదే. అందుకని చదువు మానేసి వరున్ని వెదికే ప్రయత్నం సరికాదు. ముందు ఎం.బి.ఏ. పూర్తి చేయడం పట్ల శ్రద్ధ చూపండి. చక్కగా చదువ్ఞకుని, ఉద్యోగం సంపాదించిన తర్వాత వరుణ్ణి గూర్చి ఆలోచించండి. అలా కాకుంటే బిటెక్‌ నుంచే మీరు అబ్బాయిల్ని గూర్చి ఆలోచిస్తున్నారంటే, అంతర్లీనంగా ఆకర్షణలకు గురవ్ఞతున్నారనుకోవాల్సి వస్తుంది.

సహజంగానే యవ్వన దశలో అమ్మాయిలు, అబ్బాయిలు, ప్రేమ, ఆకర్షణలకు గురవ్ఞతుంటారు. మనసులో ఉప్పొంగే ఉద్వేగాలకు ప్రేమ ముసుగు వేసి మనసును, పెద్దల్ని మభ్యపెడుతుంటారు. మీరు కూడా మనసులో చెలరేగే కోర్కెల్ని సంతృప్తిపరచేందుకు పరిచయం, స్నేహం, ప్రేమ అంటూ ఆరాటపడుతున్నారనిపిస్తుంది. మీరు అబ్బాయిల అందం, చదువ్ఞ, ఆస్తి, అంతస్తులను చూసినట్టే అబ్బాయిలు చూస్తుంటారు. కాబట్టి అబ్బాయిలను వెదకడం మాని చదువ్ఞ, కేరీర్‌ పట్ల ఏకాగ్రత పెట్టండి. ప్రతి వ్యక్తి జీవితంలోను వివిధ దశలు ఉంటాయి. ఆయా దశల్లో చేయాల్సిన పనులకు ప్రాధాన్యత ఇచ్చిన వారే ప్రగతిని సాధిస్తారు. విద్యార్థి దశ చదవమంటుంది. అయితే యవ్వనం ఉరకలు వేయమంటుంది. కాబట్టి యవ్వనపు ఆలోచనల్ని మాని విద్యార్థిగా చదువ్ఞపై దృష్టి పెట్టండి. కాగా మీరు మొదటిసారి ప్రేమలో దెబ్బతినడం వల్ల ఆత్మన్యూనతా భావానికి గురై ఉంటారు.

రెండవసారి ప్రయత్నించే సమయంలో విశ్వాసలేమి మీలో అనుమానాలను రేకెత్తించింది. దీనివల్ల సంఘర్షణకు గురవ్ఞతున్నారు. ఈ మానసిక సంఘర్షణ వల్ల ఒత్తిడి పెరిగి, కృంగుబాటు తలెత్తినట్టు భావించాల్సి వస్తున్నది. ఆకలి మందగించడం, నిద్రపట్టకపోవడం, నిరాశ నిస్పృహకు గురికావడం లాంటివి డిప్రెషన్‌ లక్షణాలు. మీరు అందని వాటికి ఆశపడి డిప్రెషన్‌ను కొని తెచ్చుకున్నారు. ఈ స్థితి ఇలాగే కొనసాగితే మరింతగా కృంగిపోయే ప్రమాదం వ్ఞంది. కాబట్టి చదువ్ఞ పూర్తయి, ఉద్యోగం సంపాదించే వరకు పెళ్లి ఆలోచనమానేయండి. ఆలోచనల నుండి బయటపడటం అంత సులభం కాదు. యోగ, ధ్యానం, సెల్ఫ్‌ హిప్పాటిజం లాంటివి మనసును అదుపులో పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఉన్నత లక్ష్యాలు, ఉత్తమ అభిరుచులు ఏర్పరచుకుంటే నూతన ఉత్సాహం కలుగుతుంది. సానుకూల ఆలోచనలు, సమతుల ఆహారం, చక్కని వ్యాయామం, సరిపడ నిద్రలాంటివి శారీరక సామార్థ్యం, మానసిక దృఢత్వానికి దోహదపడతాయి. వీటి ద్వారా మిమ్మల్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. అవసరమైతే సైకాలజిస్ట్‌ ద్వారా కౌన్సెలింగ్‌ తీసుకోండి.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌ రెడ్డి, సైకాలజిస్ట్‌