ఆలోచనలో మార్పు

తెలుసుకోండి ..
                                        ఆలోచనలో మార్పు

GIRL
GIRL

ఎప్పుడూ ఒకే విధంగా ఆలో చించకూడదు. ఆలోచనలో మార్పు రావాలి. మన ఎదురుగా ఉన్న వారిలో చాలా మంది మన కళ్ల ఎదుటే ఎదిగిపోతున్నారు. కొంతమంది పతనమై పోతున్నారు. వీటికి కారణంగా వారి వారి ఆలోచనలే. నేను అభివృద్ధి చెందాలి. అందరికన్నా భిన్నంగా ఉండాలి. ఏదో ఒకటి సాధించాలి. గుర్తింపు తెచ్చుకోవాలి. అనుకుంటే అందుకు అవసరమయ్యే ఆలోచన లు చేస్తూ ఉంటే తప్పక నీవ్ఞ అనుకున్నది సాధిస్తావ్ఞ. నీవేమి ఆలోచించకుండా, నేనింతే అని భీష్మించుకు కూర్చుంటే ఇక నీవ్ఞ ఇంతే. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే నీ జీవితం. మార్పును ఆహ్వానించు. చిన్న లక్ష్యాలను పెట్టుకో. వాటిని చిత్త శుద్దితో ఆచరించు. లక్ష్యం సిద్ధిస్తుంది. నేడు వారి వారి రంగాలలో రాణిస్తున్న వారంతా ఒకప్పుడు మామూలు మానవ్ఞలు. అయితే వారి ఆలోచనలో మార్పు చేసుకు న్నారు. అంచె లంచెలుగా ఎదుగు తున్నారు. ఏనాటికైనా వారను కున్నది సాధించి తీరుతారు. వాల్మీకి ఒక బోయవాడు. వేట అతని వృత్తి. ఒక సంఘటన కఠినమైన అతని హృదయాన్ని కరిగించింది. ఆలోచనలో మార్పు వచ్చింది. కవిత్వం రాయాలనుకున్నాడు. రంగంలోకి దిగాడు. రామాయణం రాశాడు. తనకంటూ స్థానం సంపాదించుకున్నాడు.

చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. మన జీవితం నిస్సారంగా గడిచిపోకూడదు. బాల్యం నుండే సాహసాలు చేయాలి. ఇష్టమైన రంగం ఎన్నుకోవాలి. అందులో అద్భుతాలు చేసి చూపాలి. సాధించాలి అనుకుంటే ఏదైనా సాధ్యమే. ముందుగానే ఇది సాధించ లేమనుకుంటే ఏదీ సాధించలేరు. నా ముందు ఉన్నవారు సాధించింది లేంది నేనెందుకు సాధించలేనూ అని ఆలోచించాలి. దేనికి వెనుకంజ వేయవద్దు. ధైర్యమే ఊపిరిగా ముందుకు కదులు. నీ ముందు ఏదైనా మోకరిల్లాల్సిందే. నీ తోటివాడు చదువ్ఞలో అద్భుతంగా రాణి స్తుంటే నీవెందుకు వెనుక బడ్డావ్ఞ. ఆలోచించుకో. దానికి కారణం నీవే. వాడు చదువ్ఞతున్నాడు. నీవ్ఞ చదవటం లేదు. వాడు చదువ్ఞను ప్రేమిస్తున్నాడు. నీవ్ఞ ప్రేమించటం లేదు. వాడు పుస్తకా లను పూజిస్తున్నాడు. నీవ్ఞ ఆ పని చేయడంలేదు. పుస్తకాలకు దగ్గరగా ఉండటమే విద్యార్థి విజయరహస్యం. నీ ఆలోచనలో మార్పు చేసుకో.. నీవ్ఞ వాడిలా మారతావ్ఞ.