ఆలు పిండికూర

6
ఆలు పిండికూర

కావలసిన ఆలుగడ్డలు-

పావుకేజీ, శనగపిండి-మూడు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి-2, కరివేపాకు-2 రెబ్బలు, పసుపు-పావు టేబుల్‌స్పూన్‌, కారంపొడి-ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాలపొడి-ఒక టేబుల్‌స్పూన్‌, అల్లంవెల్లుల్లి ముద్ద-అర టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర-కొద్దిగా , ఆవాలు, జీలకర్ర- పావు టేబుల్‌స్పూన్‌, ఉప్పు-తగినంత, నూనె-మూడు టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
ఆలుగడ్డలు పసుపు వేసి ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టుతీసి పొడిపొడిగా మెదిపి ఉంచుకోవాలి. గిన్నె లేదా మందంగా ఉండే కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, కారంపొడి, అల్లంవెల్లుల్లి ముద్ద కొద్దిగా వేపి ఆలుగడ్డ, తగినంత ఉప్పువేసి కలిపి మూతపెట్టాలి. కూర బాగా మగ్గిన తర్వాత ధనియాలపొడి, శనగపిండిని అరకప్పు నీళ్లలో ఉండలు లేకుండా కలిపివేయాలి. వెంటనే కలుపుతూ ఉడికించాలి. చివరలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దింపేయాలి.