ఆలయాలకు కార్తీక శోభ

Vemulawada temple
Vemulawada temple

హైదరాబాద్‌: రెండో కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము
నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటికి ప్రత్యేకంగా పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. దీంతో ప్రధాన ఆలయాలైన విజయవాడ,
శ్రీశైలం,అన్నవరం,వేములవాడ క్షేత్రాలు, కాళేశ్వ‌రం, పాత బస్తీలోని పాతశివాలయం, యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో
కిక్కిరిసిపోయాయి.