ఆర్‌సిఎ అధ్యక్షుడిగా సిపి జోషి లలిత్‌ మోడీకి చుక్కెదురు

cp joshi
cp joshi

ఆర్‌సిఎ అధ్యక్షుడిగా సిపి జోషి

లలిత్‌ మోడీకి చుక్కెదురు

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భారీ అవకతవకలకు పాల్పడిన లలిత్‌ మోడీ కొన్నేళ్ల కిందటే భారత్‌ నుంచి పారిపోయిన సంగతి తెలి సిందే. ప్రస్తుతం అతను లండల్‌లో తలదాచుకుం టున్నాడు. రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్ని కల్లో (ఐపిఎల్‌) మాజీ కమిషనర్‌ లలిత్‌ మోడీకి చుక్కెదురైంది. ఆర్‌సిఓ అధ్యక్షుడిగా పోటీ చేసిన లలిత్‌ మోడీ తనయుడు రుచిర్‌ మోడీ ఓటమి పాలయ్యాడు. రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్య క్షపదవి కోసం మే 29న ఎన్నికలు నిర్వహించారు. కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం వెల్లడైన ఆర్‌సిఓ ఎన్నికల ఫలి తాల్లో లలిత్‌ మోడీ ప్రత్యర్థి కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నాయకుడైన సిపి జోషి అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. లలిత్‌మోడీ తనయుడు రుచిర్‌ మోడీపై ఆయన విజయం సాధించాడు. అధ్యక్ష ఎన్నికల్లో జోషి 19ఓట్లు సాధించగా, రుచిర్‌ మోడీకి కేవలం 14ఓట్లు మాత్రమే పోలయ్యాయి.దీంతో 5ఓట్ల తేడాతో సిపిజోషి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే ఆర్‌సిఎ కార్యదర్శి, కోశాధికారి పదవులు మాత్రం లలిత్‌ మోడీ అనుయాయులకే దక్కడం గమనార్హం. రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసి యేషన్‌ సెక్రటరీగా రాజేంద్ర నందు, ట్రెజరర్‌గా పింకేశ్‌ జైన్‌లు ఎన్నికయ్యారు.