ఆర్‌యు మ్యారీడ్‌? ప్రారంభం

Are u Married
Are u Married

ఆర్‌యు మ్యారీడ్‌? ప్రారంభం

మౌర్య, చరిష్మా హీరోహీరోయిన్లుగా సెవెన్‌ హిల్స్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా నిర్మిస్తున్న సినిమా ‘ఆర్‌యు మ్యారీడ్‌?.. రొమాంటిక్‌ లవ్‌థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి అళహరి దర్శక నిర్మాత.. ఫిలించాంబర్‌లో ప్రారంభమైన వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్‌ క్లాప్‌ ఇచ్చారు.. ప్రవాసభారతీయుడు చిట్టిమల్ల రఘు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.. ఈసందర్భంగా దర్శక నిర్మాత అళహరి మాట్లాడారు.. ఎవరి ఊహలకుఅందని విధంగా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.గ్రాఫిక్‌ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈచిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర 23 నుంచి ప్రారంభమవుతుందన్నారు.. పెళ్లీడుకొచ్చిన యువతీయువకుల భావోద్వేగాలు ప్రస్తుత జనరేషన్‌ లైఫ్‌స్టైల్‌ని ఈసినిమా ద్వారా చూపించబోతున్నామన్నారు.. అన్నివర్గాలను అకట్టుకునే రీతిలో నిర్మాణం జరుగుతుందన్నారు.. మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ, చక్కని కాన్సెప్ట్‌తో నిర్మితమవుతున్న సినిమా ఇది అన్నారు. కాన్సెప్ట్‌ నచ్చి ఈప్రాజెక్టులో భాగస్వామినయ్యానని ఎన్నారై చిట్టిమల్ల రఘు చెప్పారు.. కార్యక్రమంలో కెమెరామెన్‌ నర్సింగ్‌రావు, సంగీత దర్శకుడు జయసూర్య, రచయిత కాంచనపల్లి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.