ఆర్‌బిఐ మిగులు నిధులపైనే కేంద్రం ఫోకస్‌!

RBI
RBI

ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆర్ధికలోటు కట్టడికోసం ప్రభుత్వం రిజర్వుబ్యాంకుపై ఒత్తిడిపెంచింది. బ్యాంకు వద్ద ఉన్న మిగులనిల్వలపైనే ఎక్కువ ఫోకస్‌పెట్టింది. మిగులునిల్వల్లో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి బదిలీచేయాలని, ఇపుడు ప్రకటించిన పథకాల అమలుకు ఈ నిధులు అవసరం అవుతాయని ఆర్ధికసేవల కార్యదర్శిగానే పనిచేసిన ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌పై ఒత్తిడినిపెంచింది. ఎన్నికల్లో ఓటర్ల మద్దతును మరింతపెంచుకునేందుకుగాను ఈ నిధులను బదిలీచేయాలని నిర్ణయించింది. బ్యాంకు వర్గాల కథనం ప్రకారం పెరుగుతున్న ఆర్ధికలోటు కట్టడికి, దేశ ఆర్ధికవ్యవస్థనున మరింత పెంపొందించేందుకుగాను భారతీయ రిజర్వుబ్యాంకు నిధులను వినియోగించాలని, ప్రభుత్వం ఇపుడు ప్రకటించిన పథకాలకుసైతం వీటిని మళ్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిఎస్‌టి వసైఊళ్లు రానురాను పనడిపోతున్నాయి. నెలవారీ లక్ష్యం లక్షకోట్లను అధిగమించలేకపోతోంది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ కథనం ప్రకారంచూస్తే కేంద్రం ఆర్ధికలోటు లక్ష్యాలు చేరుకోలేదని, లోటు కట్టడికంటే 40 బేసిస్‌ పాయింట్లు లోటుతో నడుస్తోందని తెలుస్తోంది.వచ్చే ఆర్ధికసంవత్సరానికి ఆర్ధికలోటును జిడిపిలో 3.5శాతాపనికి కట్టడిచేయాలని నిర్ణయించింది. మరింతగా రుణాలు సమీకరించి లోటు కట్టడికంటే ప్రస్తుతం ఆర్‌బిఐ వద్ద ఉన్న ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటే సరిపోతుందని భావిస్తోంది. 2018 మార్చినాటికి రిజర్వుబ్యాంకువద్ద ్మఇగులునిధులు 1.7 లక్షలకోట్లవరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రైతులకోసం వడ్డీలేని రుణాలు, రుణపరపతి పెంపు, 70వేల కోట్లతో డిబిటి వంటి వాటిని ప్రకటించినందున ఆర్‌బిఐ వద్ద ఉన్న నిధులు అత్యవసరమని భావిస్తున్నట్లు ఆర్ధికశాఖ అధికారులు చెపుతున్నారు. అలాగే పంటలబీమా పథకానికి ప్రీమియం ఉచితంగా చెల్లించడానికి ప్రభుత్వ నిధులు అవసరం అవుతాయి. ఎరువులపై సబ్సిడీలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీలు అన్నింటినీ కలిపి నేరుగా బడ్జెట్‌ కోటా కింద రైతుబంధు తరహాలో అమలుకు సన్నాహాలుచేస్తోంది. దీనివల్ల ఆర్‌బిఐ పై ఒత్తిడిపెరిగింది. శక్తికాంతదాస్‌ను ప్రభుత్వం నియమించడంలో కూడా ఇదే పరమార్ధమని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా తర్వాత బ్యాంకింగ్‌రంగంలో ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్ధికశాఖలోనే పనిచేసిన శక్తికాంతదాస్‌ను గరవ్నర్‌గా నియమించిందని విమర్శలు కూడా వచ్చినసంగతి తెలిసిందే. ప్రభుత్వంచేసే ప్రతిపాదనలను అంగీకరించే దాస్‌ ప్రభుత్వానికి ఎస్‌మ్యాన్‌గా పనిచేస్తారని ఆర్ధికరంగ నిపుణుల అంచనా. కేంద్రానికి తాత్కాలిక డివిడెండ్‌ చెల్లింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆర్‌బిఐ ఇందుకోసం ఒక నిపుణుల కమిటీని నియమించిందని, ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ బిమల్‌జలాన్‌ ఆధ్వర్యంలోని ఆర్ధిక పునర్నిర్మాణ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించి రిజర్వుల వినియోగం ఎలా ఉండాలన్నది సూచిస్తుంది. రిజర్వులను కొనసాగించాఇలా లేక ప్రభుత్వానికి అప్పగించాలా అన్నదే నిర్ణయిస్తుంది. 90రోజులలోపు కమిటీ నివేదిక అందించాల్సి ఉంది. ఆరుగురుసభ్యులున్న కమిటీ ఆర్‌బిఐ కేటాయింపులనే కొనసాగిస్తుందని, రిజర్వులు, బఫర్‌నిధులు వంటిని లోటు, నష్టాలభర్తీకి వినియోగిస్తుందని చెపుతున్నారు. అలాగే సహేతుకమైన లాభాలపంపిణీ విధానాన్ని పరిగణనలోనికి తీసుకుని ఆర్‌బిఐ వాటాను ప్రతిపాదించనున్నది. కేంద్రబ్యాంకు అంచనాలప్రకాంర చూస్తే రిజర్వులు,బఫర్‌లు అంతర్జాతీయంగా కరెన్సీ చెలామణిలో ఎదురయ్యే హెచ్చుతగ్గులు కట్టడికి, వడ్డీద్వారా వచ్చే తక్షణ మార్పులను భర్తీచేసుకునేందుకు ఈ మిగులు నిధులు అవసరమవుతాయని అంచనావేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ మిగులునిధులను సార్వత్రిక ఎన్నికల హామీల నెరేవేర్చేందుకు పనికొస్తాయన్న ధీమాతో ఉంది. మొత్తం మీద మిగులు నిల్వల బదలాయింపుపైనే ఇపుడు ఆర్‌బిఐ వర్సెస్‌ ఎన్‌డిఎప్రభుత్వం అన్న చందంగా అంతర్గత వివాదం రాజుకుంటున్నదనడంలో ఎలాంటి సందేహంలేదు.