ఆర్‌బిఐ ద్రవ్యవిధాన సమీక్షలే కీలకం

RBI1
RBI

ఆర్‌బిఐ ద్రవ్యవిధాన సమీక్షలే కీలకం

ముంబై,: దేశీయస్టాక్‌ మార్కెట్లకు వచ్చేవారం పలు అం శాలు ప్రభావితంచేసే అవకాశాలున్నాయి. గతవారం లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు మెజార్టీ వర్గాలు ఓటువేసాయి. స్టాక్‌ మార్కెట్లకు సైతం జైట్లీబడ్జెట్‌ జోష్‌ ఇచ్చింది. ప్రధాన సూచీల న్నీ నాలుగునెలల గరిష్టానికి చేరాయి. వచ్చేవారం రిజర్వుబ్యాంకు గవర్నర్‌ పటేల్‌ అధ్యక్షతన ద్రవ్య విధానపరపతి సమీక్ష ఉంటున్నది. దీనితోపాటు మరికొన్ని బ్లూచిప్‌ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలోని 3వ త్రైమాసిక ఫలితాలు వెల్లడిస్తాయి. ఇవికూడా దేశీయంగా సెంటిమెంట్‌కు కీలకంగా నిలువనున్నట్లు నిపుణుల అంచనా. అలాగే డిసెం బరునెల పారిశ్రామిక ఉత్పత్తిసూచి వివరాలు కూడా ఈ వారంలోనే విడుదలవుతాయి. ఇక ఆర్‌బిఐ చేపట్టే మానిటరీపాలసీ సమీక్ష వడ్డీరేట్లకు కీలకంగా నిలిచే రెపోరేట్లను 6.25శాతంవద్దనే కొనసాగించా లని గత సమీక్షలో నిర్ణయించింది. పెద్దనోట్ల రద్దు, బడ్జెట్‌ కేటాయింపుల నేపథ్యంలో ఈసారి రెపోరేట్ల లో పావుశాతం కోతుండవచ్చని ఆర్థిక వేత్తల అంచ నా.వచ్చేవారం మరికొన్ని కంపెనీలు త్రైమాసిక ఫలి తాలు ప్రకటిస్తాయి. బ్లూచిప్‌ కంపెనీల జాబితాలో టాటాస్టీల్‌, భెల్‌, పిఎన్‌బి, బుధవారం సిప్లా, హీరో మోటో, ఎన్‌టిపిసి, యూనియన్‌బ్యాంకు, గురు వారం బిపిసిఎల్‌, లూపిన్‌ పవర్‌గ్రిడ్‌, శుక్రవారం గెయిల్‌, ఎంఅండ్‌ఎం, స్టేట్‌బ్యాంకు, టాటాపవర్‌ సంస్థలున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫలితాలు నేడు వెల్లడి అయ్యాయి. ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌లో కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్ర అసెంబ్లీకు జరుగుతున్నప్రస్తుత ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లకు కీలకంగా నిలువను న్నాయి. గత ఏడాది నవంబరులో ప్రధానిమోడీ ఉన్నట్లుండి పెద్దనోట్ల రద్దునిర్ణయాన్ని ప్రకటించా రు. నల్లధనానికి చెక్‌పెట్టే బాటలో మరిన్ని చర్య లుంటాయని కూడా వెల్లడించారు. నగదు కొరతతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురికావ డంతో ప్రతి పక్షాలు నోట్లరద్దు అమలులో ప్రభు త్వం విఫలంఅంటూ విమర్శించాయి. ఈ ప్రభా వంఎలా ఉంటుందన్న అంచనాలు కొంతవరకూ ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ప్రతింబిస్తాయని విశ్లేషకుల అంచనా. అయితే స్థానిక అంశాలకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలియజేస్తున్నారు.

పలితాలు శనివారం 11న వెల్లడి అవుతాయి. విదేశీ మార్కెట్లలోని పరిణా మాలు, డాలరుతో రూపాయి మారకం విలువలు, ముడిచమురుధరలు వంటి అంవాలు దేశీయంగా మార్కెట్లపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.