ఆర్బిఐ గవర్నర్కు సంజాయిషీ నోటీసు!

ఆర్బిఐ గవర్నర్కు సంజాయిషీ నోటీసు!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్వ్యవస్థలో పేరుకుపోయిన మొండిబకాయిలు, ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల జాబితాతో పాటు, వారి బకాయిల వివరాలను ఆర్టిఐ కార్య కర్తకు అందించకపోవడంపై సమాచారహకు ప్రధాన కమిషనర్ రిజర్వుబ్యాంకు గవర్నర్ ఉర్జిత్పటేల్కు సంజాయిషీనోటీస్ జారీ చేసారు. ఎందుకు జారీచేయలేదో వెంటనే వివరాలు తెలియజేయాలని ఆయన ఆదేశిం చారు. అంతకుముందు ఆర్టిఐ కార్యకర్త చేసిన దరఖాస్తుపై వివరాలిచ్చేందుకు ఆర్బిఐ తిరస్కరించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుల జాబితాలను అందచేయడంలోఆర్బిఐకి ఉన్న నష్టం ఏమిటని సిఐసి ప్రశ్నించారు. సర్వో న్నత న్యాయస్థానంకూడా అప్పటి ఆర్టిఐ కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించి బకాయిదారుల జాబితాలివ్వాలని ఆదేశిం చింది. అంతేకాకుండా రానిబాకీలపై గత ఆర్బిఐ గవర్నర్ రఘురామ్రాజన్ లేఖలను బహిర్గతం చేయాలని డిమాండ్చేసింది.