ఆర్‌బిఐ ఆమోదమే తరువాయి

STATE BANK OF INDIA
STATE BANK OF INDIA

ఆర్‌బిఐ ఆమోదమే తరువాయి

న్యూఢిల్లీ, నవంబరు 28: భారతీయ స్టేట్‌బ్యాంకులో అసోసియేట్‌ బ్యాంకుల విలీనంపై బ్యాంకింగ్‌ దిగ్గ జం ఆర్‌బిఐనుంచి ఆమోదం కోసం ఎదురుచూస్తోం ది. ఆర్‌బిఐకు ఇప్పటికే సమగ్ర విలీనం ప్రణాళిక, ఆర్థిక సమస్యలు, మానవవనరులు, స్థిరాస్థి ప్రమా ణాల సమస్యలు వంటి వాటిపై సమగ్ర నివేదికలు ఇచ్చింది. ఈదశలో ఎతరుణంలో అయినా కేంద్ర బ్యాంకునుంచి అనుమతులు రావచ్చని ఎదురు చూస్తోంది. ఈ స్కీం మొదట మొత్తం ఐదు అసోసి యేట్‌ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకును కూడా విలీనం చేసుకునేందుకు ఎస్‌బిఐకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలి సిందే. ఇందుకు అనుగుణంగాన ఎస్‌బిఐ కూడీ విలీనం ప్రక్రియ ప్రారంభించింది. నిపుణుల కమిటీ సూచించిన విధంగా విలీనం జరిగే ప్రక్రియను ఆర్‌బిఐ ఆమోదం కోసం ఎస్‌బిఐ పంపించింది. ఆర్‌బిఐ ఆమోదించిన వెంటనే ఎస్‌బిఐ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపిస్తుంది.

ఈలోపు భారతీయ స్టేట్‌బ్యాంకు విలీనంలో మొదటిదశగా ఖాతాల నంబర్లను మార్పుచేస్తోంది. ఈ ఏడాఇ ప్రారంభంలోనే కేంద్రం ఎస్‌బిఐతో అసోసియేట్‌ బ్యాంకులు, మహిళా బ్యాంకును విలీనం చేసేందు కు అనుమతించింది. ఆగస్టులోఎస్‌బిఐ ఒక ప్రకటన చేస్తూ మహిళా బ్యాంకు, అనుబంధ బ్యాంకుల విలీనంద్వారా అదనంగా ఎనిమిదిలక్షలకోట్ల ఆస్తులు ఎస్‌బిఐకు వస్తాయని, మొత్తంగాచూస్తే 30 లక్షల కోట్ల టర్నోవర్‌తో ఎస్‌బిఐ నడుస్తుందని, 36శాతం పెరుగుతుందని ప్రకటించింది. ఐదు అనుబంధ బ్యాంకులు, బిఎంబి విలీనంతో ఎస్‌బిఐ ప్రపంచస్థాయి బ్యాంకుగా నడుస్తుంది. 22,500 శాఖలు, 58 వేల ఎటిఎంలతో నడుస్తుంది. మొత్తంగాచూస్తే 50 కోట్ల కుపైబడిన కస్టమర్లు ఉంటారు. ఎస్‌బిఐ ఒక్కటే ప్రస్తు తం 16,500శాఖలు,191విదేశీ కార్యాలయాలు ఉన్నా యి. మొత్తం 36దేశాల్లోబ్యాంకు విస్తరించింది. ఇప్ప టికే ఎస్‌బిఐ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్రను 2008 లోను, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌ను 2010లోను విలీనం చేసుకుంది. గత వారమే బ్యాంకు ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ అనుబంద బ్యాంకుల విలీనం కొనసాగుతోందని, నోట్లరద్దు ప్రభావం ఈ విలీనం ప్రక్రియపై లేదని స్పష్టంచేసారు.