ఆర్‌బిఎల్‌ రూ.1680 కోట్ల నిధుల సమీకరణ

RUPEES
RUPEES

ఆర్‌బిఎల్‌ రూ.1680 కోట్ల నిధుల సమీకరణ

ముంబయి, జూలై 10: ఆర్‌బిఎల్‌ బ్యాంకు ఈక్విటీ వాటాలను ప్రాధాన్యతాక్రమంలో కేటాయింపు చేయడం ద్వారా రూ.1680 కోట్లు సమీకరిస్తోంది. 32.6 మిలియన్ల షేర్లను ప్రాధాన్యతా కేటాయింపు కింద సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయిస్తోంది. ఈ నిధులు తమ మూలధన అవస రాలను తీర్చుకు నేందుకు ఉపకరిస్తుందని, బ్యాంకు వృద్ధికి, రుణ పరపతి అవసరాలకు వినియోగిస్తామని వివరించా రు. ఎబిజి కేపిటల్‌, సిడిసిగ్రూప్‌గ్లోబల్‌ ఐవివై వెంచర్స్‌, హెచ్‌డి ఎఫ్‌సి స్టాండర్డ్‌లైఫ్‌ బీమా , ఐసిఐసిఐలాంబార్డ్‌ సాధారణబీమా, ఎల్‌టిఆర్‌ఫోక స్‌ ఫండ్‌ వంటివి బ్యాంకులో కీలక ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. రూ.10 ముఖ విలువలున్న షేర్లను ఇష్యూ ధర రూ.515గా ప్రకటించింది. 2016లో బ్యాంకు రూ832 కోట్లు నిధులు సమీకరించింది. 2015లో 488 కోట్లు, 2013లో 376 కోట్లు, మూలధన వనరులకోసం ఏకరించింది. బ్యాంకు తన మొదటిశ్రేణిమూలధన వనరులను రూ.4321 కోట్లకు విస్తరించింది. అంతకుముందు 2972 కోట్ల నుంచి భారీగా వృద్ధిచేసింది. రెండోశ్రేణి మూలధన వనరులకింద 867 కోట్లు సేకరించింది. బ్యాంకు పరంగా ఆర్థికసంవత్సరంలో 446 కోటుంల సమీకరించింది. 2016లో 292 కోట్లనుంచి గణనీ యంగా వృద్ధిని సాధించింది. బ్యాంకు స్థిరాస్తులు మొత్తంగాచూస్తే 4336 కోట్లుగా ఉంది. కేపిటల్‌ అడక్వసీ రేషియో కూడా 13.7శాతంగా ఉంది.