ఆర్‌జియో నుంచి జియోటివి

Jio
Jio

ఆర్‌జియో నుంచి జియోటివి

హైదరాబాద్‌: 4జి ఎల్‌టిఇ సేవలతో టెలి కాం రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌జియో ఇన్ఫోకామ్‌ నుంచిమరో సంచలన వార్త వస్తోంది. మేనెల నుంచి దేశవ్యాప్తంగా జియోటివి సేవలు ప్రారంభిస్తామని ప్రకటించింది. డైరెక్ట్‌టు హోం సేవల రంగంలోకి ప్రవేశిస్తూ ఇప్పటికే సెట్‌ టాప్‌ బాక్సులను సిద్ధంచేసింది. ఈ సెట్‌టాప్‌ బాక్స్‌లలో ఇంటర్నెట్‌ అను సంధానిత సేవలు కూడా అందు తాయి. జియో ఇప్పటికే జియోటివి సేతల కోసం ప్రధాననగరాల్లో పనులు ప్రారంభించింది. జియో వివరాలను బట్టిచూస్తే టిడిహెచ్‌ధర రూ.1800లుగా ప్రకటిం చింది. డిటిహెచ్‌ బుకింగ్స్‌ను ఏప్రిల్‌ నుంచే ప్రారంభి స్తున్నది. ప్రారంభం మేనెలలో ఉంటుందని అంచనా. అతి తక్కువగా టిడిహెచ్‌లో రూ.180లుగా ఉంటా యని ఆర్‌జియో సిబ్బంది చెపుతున్నారు. ఇప్పటికే టెలికాం రంగంలో ఇతర కంపెనీలకు కంటిమీద కును కులేకుండాచేస్తున్న జియోకొత్తగా ప్రారంభించే డిటిహెచ్‌ తో మరింత సంచలనం సృష్టిస్తుందని అంచనా.