ఆర్యత్‌ సినీ ఎంటెర్టైన్మెంట్స్‌ నూతన చిత్రాలు!

ARYAN22
ARYAN

ఆర్యత్‌ సినీ ఎంటెర్టైన్మెంట్స్‌ రెండు నూతన చిత్రాలు!

సినిమా చూపిస్త మావ చిత్ర నిర్మాణంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయిన శ్రీమతి జి.సునీత నాయుడు, ఆ చిత్రం అందించిన విజయంతో, శ్రీ రాజశేఖరరెడ్డి గారి సమర్పణలో మరో రెండు చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జూబ్లీ హిల్స్‌ లోని వారి కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన పూజా కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు శ్రీ. క్రిష్‌, విభిన్న చిత్రాల నిర్మాత శ్రీ. రాజీవ్‌ రెడ్డి గారు, రెబెల్‌ స్టార్‌ శ్రీ కష్ణంరాజు గారి సతీమణి శ్రీమతి. శ్యామల గారు పాల్గొన్నారు. లక్ష్మికాంత్‌ చెన్నా దర్శకత్వంలో నూతన నటీనటులతో ఒక చిత్రం, మరియు సిద్దు జొన్నలగడ్డ కధానాయకుడిగా.. ఆదిత్య మండాలను నూతన దర్శకునిగా పరిచయం చేస్తూ ఇంకొక చిత్రం, ప్రారంభ పూజా కార్యక్రమాలు ఒకేరోజు జరిపారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు షాట్స్‌ కు క్రిష్‌, శ్రీమతి. శ్యామల గారు సంయుక్తంగా క్లాప్‌ నివ్వగా, రాజీవ్‌ రెడ్డి కెమెరా స్విచాన్‌ చేసారు. రెండు చిత్రాల ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ఈ నెలాఖరుకల్లా ముగించి, డిసెంబర్‌ రెండవ వారంలో సెట్స్‌ పైకి తీసుకువెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల కళాకారులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేస్తామని ఈ సందర్బంగా చిత్ర సమర్పకులు శ్రీ.రాజశేఖరరెడ్డి గారు తెలిపారు.