ఆర్బీఐ వ‌డ్డీరేట్ల‌ను మార్చ‌లేదు

RBI
RBI

న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్చలేదు. రెపో రేటు 6 శాతంగానే ఉన్నది. బ్యాంకుల నుంచి వడ్డీ తీసుకునే ఆర్బీఐ కూడా తన రివర్స్ రెపో రేటును 5.75 శాతంగానే ఉంచింది. ద్రవ్యోల్బణం తగ్గుతోందని, కానీ కనీస మద్దతు ధరలో అనిశ్చితి ఉందని, దాని వల్లే తటస్థ వైఖరిని అవలంబించినట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. ఒకవేళ ఈసారి వర్షపాతం సాధారణంగా నమోదు అయితే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని ఆయన అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సం ప్రథమార్థంలో కావాల్సినంత నగదు ఉంటుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య తెలిపారు.